ఉద్యోగరీత్యా వేరు వేరు సిటీల్లో దంపతులు.. భార్య నివసిస్తున్న ఇంటి ఓనర్ భర్తకు ఫోన్ చేసి..
ABN , First Publish Date - 2022-04-22T17:57:08+05:30 IST
దంపతులు ఉద్యోగరీత్యా వేరు వేరు సిటీల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య ఉంటున్న ఇంటి యజమాని.. భర్తకు ఫోన్ చేశాడు. అతడు చెప్పింది విని..
ప్రస్తుత జీవన పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తలు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కొందరు దంపతుల మధ్య దూరం పెరిగి చివరికి సమస్యలకు దారి తీస్తోంది. కొందరు భర్తలు భార్యలపై అనుమానం పెంచుకుని వేధింపులకు గురి చేస్తుండగా.. మరికొన్ని ఘటనల్లో భార్యలు వివాహేతర సంబంధానికి అలవాటుపడి కాపురాలను నాశనం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. బీహార్‌లో జరిగిన ఘటన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. దంపతులు ఉద్యోగరీత్యా వేరు వేరు సిటీల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య ఉంటున్న ఇంటి యజమాని.. భర్తకు ఫోన్ చేశాడు. అతడు చెప్పింది విని భర్త షాక్ అయ్యాడు. ఇంతకీ అలసు ఏం జరిగిందంటే..
బీహార్ రాష్ట్రానికి చెందిన పవన్ కుమార్, నేహా దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. ఉద్యోగ రీత్యా భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో వారి పాప.. భాగల్‌పూర్‌లో ఉంటున్న తన తాతయ్య ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఔరంగాబాద్ జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో నేహా పని చేస్తుండగా.. ఆమె భర్త పవన్ కుమార్ ఎన్టీపీసీ నబీనగర్‌లో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. భర్త అప్పుడప్పుడూ భార్య వద్దకు వెళ్లి.. యోగక్షేమాలు చూసుకుంటూ ఉండేవాడు. వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేకపోవడంతో ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. గురువారం ఉదయం భాగల్‌పూర్‌లో నేహా ఉంటున్న ఇంటి తలుపులు మూసి ఉన్నాయి.
కూతుర్ని బస్సు ఎక్కించి వచ్చిన తండ్రి.. ఇంట్లో నగ్నంగా వంట చేస్తున్న గుర్తు తెలియని మహిళను చూసి షాక్.. చివరకు..
అక్కడికి వచ్చిన పాల వ్యాపారి.. నేహాను ఎంత పిలిచినా పలకలేదు. దీంతో అనుమానం వచ్చి.. ఇంటి యజమానికి సమాచారం అందించారు. అంతా కలిసి తలుపులు బద్దలుకొట్టి లోపల చూడగా.. నేహా ఉరి వేసుకుని కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన ఇంటి యజమాని.. నేహా భర్తకు ఫోన్ చేసి, విషయం తెలియజేశాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పవన్ కుమార్.. భార్య మృతదేహంపై పడి బోరున విలపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.