డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడో వ్యక్తి.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్.. సీసీ కెమెరాల్లో..
ABN , First Publish Date - 2022-04-22T16:05:40+05:30 IST
డబ్బుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తారు. ప్రస్తుతం ఇలాంటి నేరాలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు...
డబ్బుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తారు. ప్రస్తుతం ఇలాంటి నేరాలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటే.. ఇంకొందరు దుండగులు బ్యాంకులు, ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నారు. బీహార్‌లో తాజాగా జరిగిన ఘటన సంచలనం కలిగించింది. డబ్బులు తీసుకునేందుకు ఓ వ్యక్తి ఏటీఎంకు వెళ్లాడు. అయితే లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. చివరకు సీసీ కెమెరాలను పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది.
బీహార్ రాష్ట్రం పాట్నా పరిధి రోహతాస్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బు తీసుకునేందుకు గురువారం ఉదయం ఓ వ్యక్తి లోపలికి వెళ్లాడు. అయితే లోపల ఏటీఎం మిషన్ తెరచి ఉండడం చూసి షాక్ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజీని పరిశీలిచంగా అసలు విషయం బయటపడింది. కొందరు దుండగులు బుధవారం రాత్రి ఏటీఎంలోకి చొరబడ్డారు. గ్యాస్ కట్టర్‌తో మిషిన్‌ను కట్ చేశారు. లోపల ఉన్న రూ.24.59లక్షలను ఎత్తుకెళ్లారు.
డబ్బుల్లేక ఇంటర్‌తోనే చదువుకు పులుస్టాప్.. ఇప్పుడు ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఈ కుర్రాడు చేసే పనేంటంటే..
మిషిన్‌ను కట్ చేసే క్రమంలో లోపల మంటలు చెలరేగాయి. నిందితులిద్దరూ ముఖానికి మాస్కులు ధరించడంతో గుర్తు పట్టేందుకు వీలుగా లేదు. బ్యాంకు, పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బుధవారం ఏటీఎంలో డబ్బు నింపారని, ఈ విషయం తెలిసే చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.