ఈ దొంగ చాలా విచిత్రంగా ఉన్నాడే.. ఇంట్లో చోరీ చేసి.. చివరగా టీవీపై అతడు రాసిన సందేశం చూసి యజమాని షాక్..

ABN , First Publish Date - 2022-05-26T23:35:49+05:30 IST

కొన్ని చోరీ కేసులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుంటాయి. ఇంకొన్ని కేసుల్లో చిన్న క్లూతో దొంగలు దొరికిపోతుంటారు. మరికొన్ని కేసులు ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రాకుండా ఉంటాయి. గోవాలో...

ఈ దొంగ చాలా విచిత్రంగా ఉన్నాడే.. ఇంట్లో చోరీ చేసి.. చివరగా టీవీపై అతడు రాసిన సందేశం చూసి యజమాని షాక్..
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని చోరీ కేసులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుంటాయి. ఇంకొన్ని కేసుల్లో చిన్న క్లూతో దొంగలు దొరికిపోతుంటారు. మరికొన్ని కేసులు ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రాకుండా ఉంటాయి. గోవాలో జరిగిన చోరీ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ.. నగలు, నగదును చోరీ చేశాడు. చివరగా టీవీపై ఓ సందేశం రాసి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన యజమాని.. చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకుని షాక్ అయ్యాడు. చివరగా టీవీపై సందేశాన్ని చూసి అవాక్కయ్యాడు.. వివరాల్లోకి వెళితే..


దక్షిణ గోవాలోని మార్గోవ్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఆసిబ్ జెక్ అనే వ్యక్తి ఇటీవల కుటుంబంతో సహా బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి మే 24న ఇంటికి వచ్చాడు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లగానే.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం చూసి షాక్ అయ్యాడు. బీరువాలో రూ.20లక్షల విలువైన బంగారం, వెండి నగలు, రూ.1.5లక్షల నగదు కనిపించలేదు.

రైల్వే ట్రాక్ పక్కన మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఓ మహిళ శరీర భాగాలు.. ఒకే ఒక్క క్లూతో 14 గంటల్లోనే వీడిన మిస్టరీ..!


చోరీ చేసిన దొంగ వెళ్తూ వెళ్తూ టీవీపై 'ఐ లవ్ వ్యూ' అని రాసి వెళ్లాడు. అప్పటికే కోపంతో ఉన్న ఆసిబ్‌.. టీవీపై అక్షరాలు చూసి అవాక్కయ్యాడు. తాళం వేసి ఉన్నా దొంగలు లోపలికి ఎలా వచ్చారో వారికి అర్థం కాలేదు. చివరగా బాత్‌రూం కిటికీ నుంచి వచ్చినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిని మొత్తం పరిశీలించారు. కేసు నమోదు చేసి, దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.

ఆవు పేడను ఇలా కూడా వాడొచ్చా.. ఇటుకలు తయారు చేసి, లక్షలు సంపాదిస్తున్న లెక్చరర్‌.. ఇంతకీ అది ఎలాగంటే..

Updated Date - 2022-05-26T23:35:49+05:30 IST