రాత్రి 9గంటలు అవుతున్నా ఇంటికి రాని కూతురు.. ఏమైందా అని విచారిస్తుండగా.. సడన్‌గా వచ్చిన ఫోన్ కాల్‌తో..
ABN , First Publish Date - 2022-09-01T00:13:12+05:30 IST
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొంతమంది దారుణాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఇలాంటి కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. తాగాగా ఉత్తరప్రదేశ్‌లో..
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొంతమంది దారుణాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఇలాంటి కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. తాగాగా ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ‘‘మీ కూతురు మా వద్దే ఉంది’’.. అంటూ కొందరు అగంతకులు.. చిన్నారి తండ్రికి కాల్ చేశారు. రూ.6లక్షలు ముట్టచెబితే పాపను అప్పగిస్తామంటూ షరతు పెట్టారు. చివరకు గంట గడిచిన తర్వాత దారుణానికి పాల్పడ్డారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం కాన్పూర్‌లోని మైకుపూర్వా పరిధికి చెందిన ఓ వ్యక్తి.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. తండ్రి డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలావుండగా, అతడి పదేళ్ల కూతురు సోమవారం సాయంత్రం ఆడుకోవడానికి బయటికి వెళ్లింది. అయితే అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు.. చిన్నారిని కిడ్నాప్ (Kidnapping) చేశారు. తమ కూతురు రాత్రవుతున్నా ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలిక ఆచూకీ లభించలేదు. అనంతరం రాత్రి 9గంటల ప్రాంతంలో బాలిక తండ్రికి ఫోన్ వచ్చింది. ‘‘మీ కూతురు మా వద్దే ఉంది.. అర్జంట్‌గా రూ.6లక్షలు ముట్టచెబితే.. క్షేమంగా అప్పజెబుతాం’’ అని కిడ్నాపర్లు హెచ్చరించారు.
అబార్షన్ చేయించుకునే ఆడపిల్లలతో ఒప్పందం.. ఏకంగా ఆస్పత్రినే దుకాణంగా మార్చేసి.. చివరకు..
అయితే అంత డబ్బు తన వద్ద లేదని, దయచేసి తమ కూతురిని వదిలిపెట్టాలని వేడుకున్నాడు. దీంతో చివరకు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు, అనంతరం బాలికను ప్రాణాలతోనే గంగానదిలో పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలిక మృతదేహం కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం నిందితులు బల్లు, అమిత్, సమీర్, అమీన్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.