షాకింగ్ వీడియో: ఎలుగు బంటిని చూడగానే ఆనందంతో దాని వైపే పరుగులు తీసిన చిన్న పాప.. చివరకు..
ABN , First Publish Date - 2022-05-28T21:25:58+05:30 IST
బుడి బుడి అడుగులు వేసే చిన్న పిల్లలకు ఆటలే ప్రపంచం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారికి ఇష్టమొచ్చిన ఆటలు ఆడుతూ వాటిలోనే లీనమవుతుంటారు. ఇలాంటి..
బుడి బుడి అడుగులు వేసే చిన్న పిల్లలకు ఆటలే ప్రపంచం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారికి ఇష్టమొచ్చిన ఆటలు ఆడుతూ వాటిలోనే లీనమవుతుంటారు. ఇలాంటి సమయాల్లో పెద్దల పర్యవేక్షణ ఉండాలి. లేదంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. చిన్నారులు ఆటలు ఆడుతూ అనుకోని ప్రమాదాలకు గురైన సందర్భాలు గతంలో చాలా చూశాం. కొన్నిసార్లు అదృష్టవశాత్తు ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పాప విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఎలుగుబంటిని చూడగానే చిన్నారి.. ఆనందంతో దాని వైపు పరుగులు తీసింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
వాషింగ్టన్‌లోని సియాటిల్‌కు చెందిన ఒక మహిళ.. ఇంటర్నెట్‌లో ‘హీరో మామ్’గా కీర్తించబడుతోంది. రెడ్‌మండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ మహిళకు జునిపెర్ అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల ఓ రోజు మహిళ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. అదే సమయంలో వారి ఇంటి ప్రహరీ మీదికి ఓ చిన్న ఎలుగుబంటి వచ్చింది. దాన్ని చూసిన చిన్నారి.. ఆనందంతో దాని వైపు పరుగెత్తుకుంటూ వెళ్లింది. అయితే ఇంట్లో ఉన్న మహిళకు అనుమానం వచ్చి చూడగా.. అప్పటికే పాప ఎలుగుబంటి దగ్గరకు వెళ్తూ ఉంది. దీంతో వేగంగా వెళ్లిన మహిళ.. కుమార్తెను ఎత్తుకుని అంతే వేగంగా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వావ్.. హీరో మామ్.. అంటూ నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.