Viral Video: నన్ను చూడడం ఆపండి... అంటున్న బుల్లి ఉడత.. ఇంతకీ అది ఏం చేసిందో మీరే చూడండి..
ABN , First Publish Date - 2022-06-30T01:53:12+05:30 IST
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలగడంతో పాటూ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలగడంతో పాటూ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఉడతలకు సంబంధించిన వీడియోలు గతంలో చాలా చూసుంటాం. కానీ ఈ బుల్లి ఉడత చేసిన పని.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నన్ను చూడడం ఆపండి అన్నట్లుగా.. ఆ ఉడత రియాక్షన్ ఇస్తుంది. ఇంతకీ అది ఏం పని చేసిందంటే..
ట్విటర్‌లో వైరల్ అవుతున్న వీడియోలో, ఓ బుల్లి ఉడత ఆహారం కోసం వెతుకుతుంటుంది. దానికి ఓ గోడపై కొన్ని వేరుశెనగ కాయలు కనిపిస్తాయి. ఇంకేముందీ.. చకచకా వాటి వద్దకు వెళ్తుంది. ఓ పెద్ద కాయను నోట్లో పెట్టుకుని పగలగొట్టాలని చూస్తుంది. ఇందుకోసం దాన్ని నోట్లో అటూ ఇటూ తిప్పుతూ.. శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆ కాయ గట్టిగా ఉండడంతో పగలగొట్టడం సాధ్యం కాదు. ఈ క్రమంలో దాని చూపు కెమెరా వైపు పడుతుంది.
ఈ పిల్ల ఏనుగుకు అతనంటే ఎంత ప్రేమ.. కీపర్‌ను చూడగానే ఏం చేసిందో చూడండి..
కొద్ది సేపు గమనించిన తర్వాత.. ‘‘నన్ను చూడడం ఆపండి.. దిష్టి తగులుతుంది’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. వెంటనే అటువైపు తిరిగి, వేరుశెనగ కాయను మొత్తం నోట్లో పెట్టుకుంటుంది. పక్కకు వెళ్లి తింటే బాగుంటుంది.. అనుకుంటూ మరో కాయను తీసుకుని, అక్కడి నుంచి చకచకా వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.