Viral Video: కాలువ దాటేందుకు సాహసం చేసిన యువతి.. పాపం చివరి నిమిషంలో ఊహించని షాక్..
ABN , First Publish Date - 2022-06-19T02:54:22+05:30 IST
యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేమస్ అవ్వాలని యువత శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు విజయవంతం...
యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేమస్ అవ్వాలని యువత శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు విజయవంతం అవుతుంటే ఇంకొందరు విఫలమవుతుంటారు. అయినా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొందరు అందరికంటే విభిన్నంగా చేయాలనే తాపత్రయంలో చివరకు నలుగురిలో నవ్వులపాలవుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాలువ దాటేందుకు సాహసం చేసింది. అయితే చివరకు ఏమైందో మీరే చూడండి..
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి సినిమాల్లో మాదిరి సాహసం చేయాలని ప్రయత్నించింది. ఒకే ఒక్క జంప్‌తో కాలువను దాటాలని సిద్ధమైంది. కాలువ అవతల ఓ వ్యక్తి వీడియో తీస్తున్నాడు. రెడీ ఒన్.. టూ.. త్రీ.. అనగానే యువతి పరుగందుకుంది. అయితే పాపం!.. తీరా నీటిలో అడుగు పడగానే ఒక్కసారిగా కాలు జారి బోల్తా పడింది. దీంతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. అబ్బా!.. ఈ స్టంట్ నా చావుకొచ్చిందే... అనుకుంటూ అక్కడే పడుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆహా.. అద్భుత విన్యాసం.. అంటూ కొందరు చమత్కరిస్తుంటే.. స్టంట్ చేసేముందు కాస్తా జాగ్రత్తలు పాటించు.. అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.