Viral Video: వామ్మో! ఈ బామ్మకు ఏం ధైర్యం.. అంతెత్తు నుంచి అమాంతం దూకేసింది.. ఆశ్యర్యపోతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-06-29T02:57:52+05:30 IST

రామా.. కృష్ణా.. అనుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన వయసులో.. కొందరు అందరినీ ఆశ్చర్యపరుస్తూ వివిధ విన్యాసాలు చేస్తుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈ వయసులో ఇలాంటి సాహసాలు ఎలా..

Viral Video: వామ్మో! ఈ బామ్మకు ఏం ధైర్యం.. అంతెత్తు నుంచి అమాంతం దూకేసింది.. ఆశ్యర్యపోతున్న నెటిజన్లు..

రామా.. కృష్ణా.. అనుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన వయసులో.. కొందరు అందరినీ ఆశ్చర్యపరుస్తూ వివిధ విన్యాసాలు చేస్తుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈ వయసులో ఇలాంటి సాహసాలు ఎలా సాధ్యం.. అనే సందేహం కూడా కలుగుతుంది. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. 70ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు ఎత్తైన వంతెన నుంచి నీటిలోకి దూకి.. అందరినీ ఆశ్చర్యపరచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..


ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పవిత్ర గంగా నదిలో స్నానమాచరించేందుకు దేశ నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు. ఇదిలావుండగా, ఇక్కడి గంగానది వద్ద మంగళవారం స్నానం చేయడానికి వచ్చిన వృద్ధురాలు ఈ సాహసం చేసింది. నదిపై ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై యాత్రికులు గుంపులు గుంపులుగా ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వృద్ధురాలు బ్రిడ్జి రెయిలింగ్ అవతలికి వెళ్లి నిలబడుతుంది. వృద్ధురాలు ఏం చేస్తుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. అమాంతం గంగానదిలోకి దూకేస్తుంది.

వావ్! ఈ seal పూలు అందించి.. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయగానే.. ప్రియురాలి రియాక్షన్ చూడండి..


దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. నీటి ప్రవాహం ఉన్నా చాకచక్యంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతుంది. అక్కడే ఉన్న కొందరు యాత్రికులు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియోపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇలాంటి సాహసాలు చేయడం ప్రమాదకరమని, వృద్ధురాలు ఎవరు, ఎందుకు ఇలా చేసిందనే వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.





Updated Date - 2022-06-29T02:57:52+05:30 IST