Viral Video: గోడ పైనుంచి దిగలేక ఇబ్బంది పడుతున్న పిల్లి.. గమనించిన బుడ్డోడు ఎలా రక్షించాడో మీరే చూడండి..
ABN , First Publish Date - 2022-06-27T03:06:50+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే వింతలు, విశేషాలన్నీ క్షణాల్లో వీడియోలతో సహా ప్రత్యక్షమవుతున్నాయి. వీటిలో కాస్త విభిన్నంగా ఉండే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇక జంతువులకు..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే వింతలు, విశేషాలన్నీ క్షణాల్లో వీడియోలతో సహా ప్రత్యక్షమవుతున్నాయి. వీటిలో కాస్త విభిన్నంగా ఉండే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. ఓ పిల్లి గోడ పైనుంచి దిగలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. గమనించిన ఓ బుడ్డోడు.. చాలా తెలివిగా దాన్ని కాపాడతాడు..
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి ఓ పెద్ద గోడపై ఓ తెల్లటి పిల్లి ఇరుక్కుపోతుంది. కిందకు దిగలేక అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బంది పడుతుంటుంది. అక్కడే ఉన్న ఓ బుడ్డోడు దాన్ని గమనిస్తాడు. ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు. కానీ గోడపైకి ఎక్కేందుకు సాధ్యం కాదు. దీంతో వినూత్నంగా ఆలోచించి.. ఓ అట్టె పెట్టెను తీసుకుని చేతులతో పైకి ఎత్తి పట్టుకుని, గోడ పక్కన నిలబడతాడు. పిల్లి అందులోకి దిగాలని చూస్తుంది కానీ.. ముందు చాలా భయపడుతుంది. తర్వాత ఎట్టకేలకు ఆ పెట్టెలోకి దిగుతుంది. ఆ విధంగా పిల్లిని రక్షించిన బాలుడి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు బాలుడిని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.