Advertisement
Advertisement
Abn logo
Advertisement

Viral video: కాస్త పిజ్జా ఇచ్చి పుణ్యం కట్టుకోండయ్యా.. అంటూ యజమానికి పిల్లి వేడుకోలు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

తినుబండారాల కోసం పిల్లలు ఎంత ఆశపడతారో అందరికీ తెలుసు. ఇటీవల పిల్లలు, యువతపై ఫాస్ట్‌ఫుడ్ ఎంతగా ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బర్గర్‌, పిజ్జా తదితరాలకు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. ఇటీవల పిజ్జాకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఓ నల్ల పిల్లి వీడియో వైరల్ అవుతోంది. పిజ్జా కోసం యజమానిని ప్రాథేయపడుతున్న పిల్లిని చూస్తే.. ఆశ్చర్యంతో పాటూ నవ్వు తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘క్యాట్స్ ఆఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ అనే అకౌంట్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. యజమాని చేతిలో ఉన్న పిజ్జా ముక్కను చూసిన ఈ నల్ల పిల్లి ఆశగా అక్కడికి వస్తుంది. అయితే యజమాని మాత్రం పిజ్జాను ఇవ్వకుండా కొద్దిసేపు ఊరిస్తాడు. దీంతో పిజ్జా ముక్క కోసం పిల్లి తెగ ప్రాథేయపడుతుంది. కాస్త పిజ్జా ఇచ్చి పుణ్యం కట్టుకోండయ్యా.. అన్నట్లుగా దాని ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. అయ్యో పాపం పిజ్జా తినాలని ఎంత ఆశ ఉందో... అనిపించేలా పిల్లి ప్రవర్తన ఉంటుంది. దీంతో ఈ పిల్లి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సింహాలతో సరదా సరదాగా మహిళ వాకింగ్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

‘అందరికీ నమస్కారం. కొత్త వ్యక్తులందరికీ నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ఈ సమయాన్ని వెచ్చించాలనుకున్నాను. నా పేరు వాడ్స్‌ వర్త్‌. నాకు అడుక్కోవడం చాలా ఇష్టం. నాకు జాక్స్‌, కట్లర్‌, మిస్టరీ అనే ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు’ అని క్యాప్షన్ ఇస్తూ పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

రెస్టారెంట్‌లోకి ఉన్నట్టుండి ఎంట్రీ ఇచ్చిన దున్నపోతు.. మామూలు రచ్చ చేయలేదు కదా..

ఇవి కూడా చదవండిImage Caption

ఆడ వేషం ధరించి ఆన్‌లైన్‌లో అమ్మాయిలకు వల.. నమ్మకం ఏర్పడగానే ప్రేమ నాటకం.. అశ్లీల ఫొటోలతో..అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ.. దోచుకున్న అనంతరం వంట గదిలో చేసిన చిన్న పనితో.. చివరకు 19ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం.. ఒక్కసారిగా రూ.8కోట్లు దక్కడంతో.. ఫిబ్రవరిలో పెళ్లి ఉండగా... ఒప్పందం ప్రకారం నడుచుకోలేదని.. వరుడు తీసుకున్న నిర్ణయం ఎంత వరకు వెళ్లిందంటే..ఫిట్స్ కారణంగా చనిపోయాడంటూ భర్త అంత్యక్రియలు.. రెండు రోజుల తర్వాత కొడుకు బయటపెట్టిన నిజం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..Viral Video: రెస్టారెంట్‌లోకి ఉన్నట్టుండి ఎంట్రీ ఇచ్చిన దున్నపోతు.. మామూలు రచ్చ చేయలేదు కదా..


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement