యూట్యూబ్‌లో డాక్టర్ చూస్తున్న వీడియోలేంటో తెలిసి నివ్వెరపోయిన పేషెంట్.. మొబైల్‌లో రికార్డ్ చేసి..
ABN , First Publish Date - 2022-04-12T17:28:49+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడెక్కడో జరిగిన చిన్న చిన్న ఘటనలు కూడా క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఇక వినూత్నమైన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడెక్కడో జరిగిన చిన్న చిన్న ఘటనలు కూడా క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఇక వినూత్నమైన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో డాక్టర్ చూస్తున్న వీడియోలు ఏంటో తెలుసుకుని ఓ పేషంట్ నివ్వెరపోయాడు. మొబైల్ రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా షేర్ చేసిన వీడియోలోని సమాచారం ప్రకారం.. ఓ టిక్‌టాకర్ చికిత్స నిమిత్తం వైద్యురాలి వద్దకు వెళ్తుంది. అయితే ఆమెను పరీక్షించాల్సిన వైద్యురాలు.. ముందుగా ఓ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, అందులో యూట్యూబ్ ఆన్ చేస్తుంది. ఆమె చేయాల్సిన చికిత్సను ఎలా చేయాలనే విషయంపై అందులో సెర్చ్ చేస్తుంది. వైద్యురాలు వీడియోలు చూడడాన్ని గమనిస్తున్న టిక్‌టాకర్ అవాక్కవుతుంది. తన మొబైల్‌లో ఫొటోలు, వీడియోలు తీసింది. "చికత్స ఎలా చేయాలో డాక్టర్ యూట్యూబ్ వీడియోలు చూస్తోంది.. ఈమె యూట్యూబ్ విశ్వవిద్యాలయంలో MD పొందారు".. అని సెటైరికల్‌గా క్యాప్షన్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
డబ్బుల్లేక ఇంటర్‌తోనే చదువుకు పులుస్టాప్.. ఇప్పుడు ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఈ కుర్రాడు చేసే పనేంటంటే..
దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వామ్మో! ఇలాంటి వైద్యురాలు కూడా ఉంటారా అని కొందరు, ఈ డాక్టర్ భలే కామెడీగా ఉన్నారే.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం వైద్యురాలికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ‘‘రోగిని పరీక్షించే ముందు డాక్టర్ కొన్ని విషయాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకుంటారు’’. ‘‘ వైద్యులు ఎప్పటికప్పుడు విషయాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేస్తారు’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.