Viral Video: కుక్కే కదా తింటే పోలా అనుకుంది.. దెబ్బకు పులికి దిమ్మ తిరిగింది.. చూస్తే అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2022-02-23T01:06:46+05:30 IST

ఇటీవల ఓ వీడియో వైరల్ అవుతోంది. కుక్కే కదా లటుక్కున పట్టుకుని, చటుక్కున తినేద్దాం.. అనుకుంటూ ఓ పులి ఆవేశంగా వచ్చింది. పడుకున్న కుక్క ఎదురుగా వచ్చి ఒక్క గాండ్రింపు ఇచ్చింది. చివరకు ఏమైందో మీరే చూడండి...

Viral Video: కుక్కే కదా తింటే పోలా అనుకుంది.. దెబ్బకు పులికి దిమ్మ తిరిగింది.. చూస్తే అవాక్కవుతారు..

ఇంట్లో బంధించి కొడితే పిల్లి కూడా పులి అవుతుందనే సామెత అందరికీ తెలిసిందే. ఏదారీ లేనప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంత చిన్న జంతువైనా ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. చావోరేవో తేల్చుకునే సమరంలో ఒక్కోసారి చిన్న చిన్న ప్రాణులే విజయం సాధిస్తుంటాయి కూడా. ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. ఇటీవల ఓ వీడియో వైరల్ అవుతోంది. కుక్కే కదా లటుక్కున పట్టుకుని, చటుక్కున తినేద్దాం.. అనుకుంటూ ఓ పులి ఆవేశంగా వచ్చింది. పడుకున్న కుక్కకు ఎదురుగా వచ్చి ఒక్క గాండ్రింపు విసిరింది. చివరకు ఏమైందో మీరే చూడండి.


ట్విట్టర్‌‌‌‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఫారెస్ట్‌‌లోని మట్టి రోడ్డుపై కుక్క పడుకుని ఉంటుంది. పక్కన ఉన్న పొదల్లోంచి ఓ పులి దీన్ని గమనిస్తూ ఉంటుంది. కుక్కే కదా నోట కరుచుకుని ఎత్తుకెళ్దాం అనుకుంటూ వేగంగా దాని ముందుకు వచ్చి గాండ్రిస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కుక్క  లేచి నిలబడుతుంది. చావో, రేవో తేల్చుకుందాం అనుకుంటూ పులికి దీటుగా గట్టిగా మొరగడం ప్రారంభిస్తుంది. ‘‘నువ్వు పులివైతే నాకేం భయం.. నా జోలికొస్తే బాగుండదు చెప్తున్నా’’ అన్నట్లుగా సమాధానం ఇస్తుంది. కుక్క తిరుగుబాటును ఊహించని పులి.. అలాగే చూస్తూ ఉండిపోతుంది. చివరకు ‘‘ఈ రోజు నా టైం బాలేదు’’ అన్నట్లుగా తోక ముడుస్తుంది. ఈ ఘటనను మొత్తం పక్కనే వాహనాల్లో ఉన్న సందర్శకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. పులికే చుక్కలు చూపించిన కుక్క.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.

కోబ్రాను పట్టుకునేందుకు ఈ యువతి పెద్ద సాహసమే చేసింది.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..





Updated Date - 2022-02-23T01:06:46+05:30 IST