Viral video: వావ్! ఈ కుక్క పిల్ల ఎంత బాగా స్కేటింగ్ చేస్తుందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-05-15T17:50:11+05:30 IST

కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అచ్చం మనుషుల్లానే కుక్కలు కూడా చాలా పనులు చేయడం..

Viral video: వావ్! ఈ కుక్క పిల్ల ఎంత బాగా స్కేటింగ్ చేస్తుందో మీరే చూడండి..

కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అచ్చం మనుషుల్లానే కుక్కలు కూడా చాలా పనులు చేయడం చూస్తూనే ఉంటాం. కొన్ని కుక్కలు ఎలాంటి శిక్షణ లేకుండానే విచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటి కుక్కల కోసం చాలా మంది లక్షలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుక్క స్కేటింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.


ట్విటర్‍‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుక్కపిల్ల అందరి ఎదుట చేసిన స్టంట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. స్రేట్ బోర్డును పట్టుకుని స్టంట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ స్టంట్ చూసేందుకు పక్కన జనం గుమికూడి ఉంటారు. ముందుగా స్కేట్ బోర్డును నోటితో పట్టుకుని అటూఇటూ తిప్పుతుంది. తర్వాత బోర్డుపైకి ఎంతో చాకచక్యంగా ఎక్కి ముందుకూ, వెనక్కు స్కేటింగ్ చేయడం.. అందరినీ ఆకట్టుకుంటుంది. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా స్కేటింగ్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ కుక్క చాలా తెలివైనదంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా.. అద్భుతమైన స్కేట్ డాగ్.. అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 

అంతా చూస్తుండగా... గుర్రంపై వరుడు పరార్.. అసలు కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..





Updated Date - 2022-05-15T17:50:11+05:30 IST