Viral Video: కుక్కను చుట్టేసిన కొండచిలువ.. తప్పించుకునేందుకు కుక్క విశ్వప్రయత్నం.. చివరగా..

ABN , First Publish Date - 2022-01-26T00:32:21+05:30 IST

ఓ ట్విట్టర్ ఖాతాలో కొండచిలువ వీడియో తెగ వైరల్ అవుతోంది. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న కుక్కను ఓ కొండచిలువ పట్టుకుంటుంది. ఒక్కసారిగా గట్టిగా చుట్టేయడంతో కుక్క విలవిలలాడుతుంది. కొండచిలువ నుంచి తప్పించుకునేందుకు...

Viral Video: కుక్కను చుట్టేసిన కొండచిలువ.. తప్పించుకునేందుకు కుక్క విశ్వప్రయత్నం.. చివరగా..

కొండచిలువలు విష పూరితం కాకపోయినా.. ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. వాటికి చిక్కిన జంతువులు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల చాలా చూస్తూనే ఉన్నాం. కుక్కను పట్టుకున్న ఓ కొండచిలువ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొండచిలువ నుంచి తప్పించుకోవడానికి కుక్క విశ్వప్రయత్నం చేస్తుండగా అనుకోని ఘటన జరిగింది..


ఓ ట్విట్టర్ ఖాతాలో కొండచిలువ వీడియో తెగ వైరల్ అవుతోంది. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న కుక్కను ఓ  కొండచిలువ పట్టుకుంటుంది. ఒక్కసారిగా గట్టిగా చుట్టేయడంతో కుక్క విలవిలలాడుతుంది. కొండచిలువ నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. దాదాపు ప్రాణాలు పోతాయనుకున్న క్రమంలో స్థానికులు కొందరు గమనిస్తారు. వెంటనే అక్కడికి వచ్చి కొండచిలువ తలను గట్టిగా పట్టుకుంటారు. ఈలోగా మరో ఇద్దరు అతి కష్టం మీద కొండ చిలువ నుంచి కుక్కను కాపాడతారు. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డ కుక్క.. అక్కడి నుంచి పరుగు లంగించుకుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ పాముకు కూడా కొబ్బరి బోండాలు కావాలేమో.. ఎలా ఎక్కుతోందో మీరే చూడండి..





Updated Date - 2022-01-26T00:32:21+05:30 IST