Viral Video: ఈ కుక్కది ఎంత మంచి మనసు.. పులి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూడండి..

ABN , First Publish Date - 2022-05-18T15:50:35+05:30 IST

కుక్క కడుపున పంది, పంది కడుపున ఏనుగు.. ఇలా ఒక జంతువుకు ఇంకో జంతువు పుట్టిన ఘటనలు చాలా చూశాం. అలాగే ఒక జంతువు పిల్లలను మరో జంతువు ప్రేమగా చూసుకోవడం కూడా...

Viral Video: ఈ కుక్కది ఎంత మంచి మనసు.. పులి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూడండి..

కుక్క కడుపున పంది, పంది కడుపున ఏనుగు.. ఇలా ఒక జంతువుకు ఇంకో జంతువు పుట్టిన ఘటనలు చాలా చూశాం. అలాగే ఒక జంతువు పిల్లలను మరో జంతువు ప్రేమగా చూసుకోవడం కూడా చూస్తుంటాం. అయితే పులి పిల్లలను కుక్క ప్రేమగా చూసుకోవడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్క వద్ద మూడు పులి పిల్లలు ఆడుకుంటూ ఉండటం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


చైనాలోని ఓ జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులి ఎన్‌క్లోజర్‌కు సమీపంలో లాబ్రడార్ కుక్క పడుకుని ఉంటుంది. దాని పక్కనే మూడు పులి పిల్లలు అటూఇటూ తిరుగుతూ, కుక్కను ప్రేమగా నిమరడం చేస్తుంటాయి. వాటిని కుక్క తన సొంత పిల్లల్లా చూసుకోవడం అందరినీ ఆకట్టుకుంటుంది. పులి తన పిల్లలకు పాలు ఇచ్చేందుకు నిరాకరించడంతో జూ అధికారులు వాటిని ఆలనాపాలనా చూసుకునే బాధ్యత కుక్కకు అప్పగించారు. ఈ ప్రయత్నం విజయంవంతం అవుతుందో లేదో అనే సందేహంలో ఉన్న అధికారులు, చివరకు అనుకున్నది సాధించారు.

రైలు నుంచి పిల్లలతో పాటూ కిందకు దూకేసిన మహిళ.. సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో..


పులి కంటే కుక్కతోనే పిల్లలు బాగా కలిసిపోయాయని చెబుతున్నారు. పులులు కొన్నిసార్లు తమ పిల్లలకు పాలిచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వాటిని దూరంగా వదిలేస్తుంటాయని అధికారులు తెలిపారు. పులి పిల్లలు కుక్కతో కలిసిపోవడాన్ని జూకు వచ్చే సందర్శకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వావ్! ఈ కుక్క పిల్ల ఎంత బాగా స్కేటింగ్ చేస్తుందో మీరే చూడండి..





Updated Date - 2022-05-18T15:50:35+05:30 IST