Viral Video: సింహం చనువిచ్చింది కదా అని.. ఈ యువకుడు ఏకంగా సెల్ఫీనే దిగేశాడు..
ABN , First Publish Date - 2022-04-04T02:07:23+05:30 IST
ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం.. ఏకంగా సింహాలను చూడడంతో పాటూ.. ఫొటో దిగి, వాటితోనే ఆడుకుంటూ ఉన్నాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలు సోషల్ మీడియాలో...
‘‘పులిని దూరం నుంచి చూడాలనుకుంటే చూసుకో.. పులితో ఫొటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా ట్రై చేయొచ్చు.. అంతేకానీ చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే వేటాడేస్తది’’.. ఇది సినిమా డైలాగ్. కానీ నిజ జీవితంలో ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం.. ఏకంగా సింహాలను చూడడంతో పాటూ.. ఫొటో దిగి, వాటితోనే ఆడుకుంటూ ఉన్నాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
యూఏఈకి చెందిన హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్.. ఓ పెద్ద వ్యాపారవేత్త. దుబాయ్‌లోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన హుమైద్.. ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు జంతువులంటే ఎంతో ప్రేమ. దీంతో అల్బుకైష్ జంగిల్ అనే పేరుతో దుబాయ్‌లో ఓ జూ పార్కును నిర్వహిస్తున్నాడు. ఈ జూలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు తదితర జంతువులన్నీ ఉన్నాయి. వాటి పోషణ విషయంలో హుమైద్.. చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సింహాలు, పులులు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి వాటితో స్నేహం చేస్తాడు. వీలు ఉన్నప్పడల్లా వాటితో ఫోటోలు దిగుతూ, సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. తాజాగా సింహాలతో ఫొటోలు దిగిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వావ్! సూపర్.. హుమైద్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.