రైతుల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం..

ABN , First Publish Date - 2021-06-18T05:23:41+05:30 IST

రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం పని చేస్తోందని, అందుకు నిదర్శనం రైతుబంధు అని ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్‌ అన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం..
మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సంపత్‌

- కాల్వశ్రీరాంపూర్‌ మండల సమావేశంలో ఎంపీపీ నూనేటి సంపత్‌

- ఏఎన్‌ఎం, ఆశాల సేవలను అభినందించిన సభ్యులు

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 17: రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం పని చేస్తోందని, అందుకు నిదర్శనం రైతుబంధు అని ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ ఈ సంవత్సరం వేసవి కాలం పంటలకు ఎస్‌ఆర్‌ ఎస్‌పీ ఆయకట్టు భూములకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సాగునీరు అందించి రైతుల పంటలకు ప్రాణం పోశాడన్నారు. గత సంవత్సర కాలంగా ప్రజలను వేధిస్తున్న కొవిడ్‌ విషయంలో డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాలు చేస్తున్న పనితీరు, సేవలను మండల సభ ప్రత్యేకంగా అభినం దించింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పనులు కాంట్రాక్టర్లు సకాలంలో చేయకపోవడం వల్ల ప్రజలకు తాగునీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని పనులు చేయడంతో పైపులు లీకేజీ అయి తాగునీరు కలుషితం అవుతోందని, నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. గంగారం సర్పంచ్‌ మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అఽదికారికి తెలుపగా డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవాలని ఏఈ చెప్పిన ట్టు సభలో సర్పంచ్‌ ఆరోపించారు. ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ చెబితేనే తాను పని చేయాలా అంటూ ప్రశ్నించాడని సర్పంచ్‌ కొకంటి మల్లారెడ్డి పేర్కొనగా, ఈ విషయంపై స్పందించిన ఎంపీపీ విద్యుత్‌ ఉద్యోగుల పనితీరుపై నివేదికను కలెక్టర్‌కు ప్రత్యేకంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నిరుపేదలకు రేషన్‌బియ్యం ఇస్తున్నా సంబంధిత రేషన్‌ డీలర్లు రేషన్‌కార్డులు ఉన్న వారికి బియ్యం పోయకుండా అమ్ముకుంటున్నారని, గం గారంలో జరుగుతున్న విషయంపై సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని సర్పంచ్‌ కొంకటి మల్లారెడ్డి అన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉండే విధంగా 108 వాహనం ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవి సభ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే 108వాహనం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఎంపీపీ తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి న ఇంటికి ఇంకుడు గుంతల ఈ కార్యక్రమంలో నిర్మించిన లబ్ధి దారులకు ఇంతవరకు డబ్బులు రావడం లేదని, ఎంపీటీసీ గూ డెపు జనార్ధర్‌రెడ్డి ఆరోపించారు. రైతు వేదికల నిర్మాణానికి కేం ద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా రైతు వేదికలపై నరేంద్రమోద బొమ్మ పెట్టకపోవడం ఏమిటని సంబంధిత అధికారిని సభలో నిలదీశారు. ప్రజాప్రతినిధులతో అధికారులు జవాబుదారీతనంగా పనిచేసి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఎంపీపీ కోరారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంపీపీ నూనేటి సంపత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్‌పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ కిషన్‌, వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ కొట్టె సుజాత, సింగిల్‌విండో చైర్మన్‌ చదువు రామచంద్రారెడ్డి, మండల కోఆప్షన్‌ మెంబర్‌ ఎండీ ఇబ్రహీం, మండల పర్యవేక్షకులు పో లు సురేష్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:23:41+05:30 IST