మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-18T04:41:14+05:30 IST

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఆసరా చెక్కును అందజేస్తున్న మంత్రి సురేష్‌

మంత్రి సురేష్‌

పెద్ద దోర్నాల, అక్టోబరు 17 : మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో  ఆసరా రెండో విడత సంబరాలను ఆదివారం నిర్వహించారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారి బాబూరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా హాజరైన మంత్రి సురేష్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం పలు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని 2022 ఆగస్టు నాటికి మొదటి సొరంగం ద్వారా, 2023 ఫిబ్రవరి నాటికి రెండో సొరంగం ద్వారా కృష్ణా జలాలు అందించేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. అనంతరం మండలంలో 553 సంఘాలకు   రూ.3,13,97,989 చెక్కును మహిళలకు అందజే శారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఎంపీడీవో కార్యాలయ సముదాయాన్ని మంత్రి సురేష్‌ పరిశీలించారు. అందుకు అవసరమయ్యే నిధులను మంజూరు చేసేందుకు తగిన చర్యలు చేపడతామని, త్వరిత గతిన పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మా పద్మజ, జడ్పీటీసీ డుమావత్‌ లతాభాయి, దోర్నాల సర్పంచి చిత్తూరి హారిక, దోర్నాల, ఎర్రగొండపాలెం ఎంపీడీవోలు షేక్‌ మౌలా, సాయికమార్‌, వెలుగు ఏపీఎం పాండురంగ ప్రసాద్‌, వైఎస్సార్‌ సీపీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ మజీద్‌, మాజీ జడ్‌పీటీసీ రామిరెడ్డి, కానిపాకం సిద్దివినాయక దేవాలయ కమిటీ సభ్యురాలు జోగి రామసుబ్బమ్మ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T04:41:14+05:30 IST