స్నేహితుడితో కలిసి అత్త ఇంటికి వెళ్లిన యువకుడు.. దుస్తులు మార్చుకుని బయటికి వచ్చాడు.. స్థానికులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా..

ABN , First Publish Date - 2022-04-23T17:38:44+05:30 IST

ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లల్లో కూడా నేర స్వభావం పెరిగిపోతోంది. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావమో ఏమో గానీ చాలా మంది పిల్లలు.. పెద్ద పెద్ద నేరాలు చేస్తూ..

స్నేహితుడితో కలిసి అత్త ఇంటికి వెళ్లిన యువకుడు.. దుస్తులు మార్చుకుని బయటికి వచ్చాడు.. స్థానికులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లల్లో కూడా నేర స్వభావం పెరిగిపోతోంది. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావమో ఏమో గానీ చాలా మంది పిల్లలు.. పెద్ద పెద్ద నేరాలు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు యువకులైతే మరీ ఘోరంగా వయసు, వరసలు మరచి అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు చేసిన పని స్థానికంగా సంచలనం కలిగించింది. స్నేహితుడితో కలిసి అత్త ఇంట్లోకి వెళ్లా్డు. అయితే తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరూ దుస్తులు మార్చుకుని వచ్చారు. స్థానికులకు అనుమానం వచ్చి.. లోపలికి వెళ్లి చూసి షాక్ అయ్యారు.. ఈ కేసులో నిందితులకు తాజాగా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.  ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పంకజ్ త్యాగి అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. పంకజ్ వృత్తిరీత్యా ఇంజనీర్ కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకూ బయటే ఉండేవాడు. ఈ క్రమంలో పంకజ్ మేనల్లుడు ఆకాష్.. తరచూ వారింటికి వస్తూ ఉండేవాడు. అత్తతో చనువుగా మాట్లాడుతూ ఆమెపై లోలోపలే ప్రేమ పెంచుకున్నాడు. కానీ ఈ విషయం అత్తకు ఎలా చెప్పాలో తెలీక.. రోజూ వివిధ రకాలుగా ఆలోచించేవాడు. ఓ రోజు పంకజ్ పని మీద బయటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆకాష్.. ఎలాగైనా తన ప్రేమను అత్తకు తెలియజేయాలని అనుకున్నాడు. తన అత్తను పిలిచి.. ‘‘ నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు ఒప్పుకొంటే పెళ్లి చేసుకుంటా’’.. అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఏం మాట్లాడుతున్నావ్.. అంటూ కోపంగా అనడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇంటికి వచ్చిన పంకజ్‌కు భార్య జరిగిన విషయం మొత్తం తెలియజేసింది. తన మేనల్లుడు ఇలా చేస్తాడని ఊహించని పంకజ్.. ఈ మాట చెప్పగానే తట్టుకోలేకపోయాడు. ఆకాష్‌ని పిలిచి.. ‘‘ఇంకోసారి ఇలా చేస్తే.. బాగుండదు’’.. అంటూ గట్టిగా మందలించాడు.

తండ్రి అంటే ఆ తొమ్మిది మంది కూతుళ్లకు ఎంతో అభిమానం.. అయితే అతను వారి పక్కన కూర్చుని చేసిన పనికి..


మామ మందలించడంతో అత్తపై ఆకాష్ పగ పెంచుకున్నాడు. ఓ రోజు తన స్నేహితుడైన రాహుల్‌ను తీసుకుని అత్త ఇంటికి వెళ్లాడు. లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా అత్తపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత ఇద్దరూ బాత్‌రూంకి వెళ్లి దుస్తులు మార్చుకుని బయటికి వెళ్లిపోయారు. వీరిని చూడగానే స్థానికులకు అనుమానం వచ్చి.. లోపలికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎంతో శ్రమించి ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. 2013 జూలైలో జరిగిన ఈ ఘటనపై కోర్టులో విచారణ నడుస్తోంది. సాక్షాధారాలను పరిశీలించిన కోర్టు.. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తాజాగా తీర్చు ఇచ్చింది. దీంతో ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పని నుంచి అలసిపోయి ఇంటికొచ్చిన భర్త.. బెడ్‌రూంలో ఎవరో ఉన్నట్లు అనుమానం వచ్చి.. తలుపు తీసి చూడగా..

Updated Date - 2022-04-23T17:38:44+05:30 IST