Advertisement
Advertisement
Abn logo
Advertisement

పారిశుధ్య కార్మికులకు పనిభారం తగ్గించాలి

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 3 : మునిసిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులపై అదనపు పనిభారాన్ని తగ్గించాలని సీఐటీయూ యూనియన్‌ కార్యనిర్వహక కార్యదర్శి మామిడి సుందరయ్య, సీపీఎం నాయకులు కోట గోపి, ఎల్గూరి గోవింద్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు విధులు, బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు చాగంటి వెంకటరమణ, వల్ధాస్‌ మధుసూధన్‌, బండారు మురళీ, దశరథ, లక్కపాక శివ, లింగయ్య, వెంకన్న, నర్సమ్మ, యల్లమ్మ పాల్గొన్నారు.  


Advertisement
Advertisement