Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి

టీడీపీ ‘భీమిలి’ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు

భీమునిపట్నం(రూరల్‌), డిసెంబరు 6: రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ పూర్తిగా వైఫల్యం చెందిందని, ఈ ప్రభుత్వాన్ని   తరిమికొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు పేర్కొన్నారు. సోమవారం మండలం లోని అన్నవరం గ్రామంలో ప్రజా సమస్యలపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితిలో ప్రభుత్వం వుందని విమర్శించారు. దీంతో వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. తొలుత గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, తెలుగుమహిళ ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి, విశాఖ పార్లమెంట్‌ రైతు ప్రధాన కార్యదర్శి డీఏఎన్‌ రాజు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement