Advertisement
Advertisement
Abn logo
Advertisement

గర్భవతిని అయ్యానంటూ శుభవార్తను చెప్పిన ప్రేయసికి ఊహించని షాకిచ్చిన ప్రియుడు.. అసలేం జరిగిందంటే..

వారిద్దరూ ప్రేమికులు.. పెళ్లికి ముందే సహజీవనం చేశారు.. భార్యాభర్తల్లానే కలిసి జీవించారు.. ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చింది.. ఆ విషయాన్ని ఎంతో సంతోషంగా తన ప్రియుడికి చెప్పింది.. ఆ వార్త విని యువకుడు షాకయ్యాడు.. వీలు చూసుకుని అక్కణ్నుంచి పరారయ్యాడు.. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.. దర్యాఫ్తు సాగించిన పోలీసులు ఎట్టకేలకు ఆ యువకుణ్ని పట్టుకున్నారు..


బీహార్‌కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ ఛత్తీస్‌గఢ్‌కు పని కోసం వచ్చి స్థానిక యువతితో ప్రేమాయణం సాగించాడు. కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేశాడు. ఎలాగూ పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశంతో ఆ యువతి అతడికి శారీరకంగా కూడా దగ్గరైంది. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆ వార్తను ఎంతో సంతోషంగా ఇంతియాజ్‌కు చెప్పింది. ఆ వార్త విని ఇంతియాజ్ షాకయ్యాడు. వీలు చూసుకుని ఛత్తీస్‌గఢ్ నుంచి పరారయ్యాడు. 


ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో బాధిత మహిళ జూన్ 14న పోలీసులను ఆశ్రయించింది. ఇంతియాజ్‌పై అత్యాచారం కేసు పెట్టింది. దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు ఇంతియాజ్ ఆచూకీ కనిపెట్టారు. బీహార్‌లోని తన స్వగ్రామంలోనే ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి ఓ స్పెషల్ టీమ్ బీహార్‌కు వెళ్లి ఇంతియాజ్‌ను అరెస్ట్ చేసింది. అతడిని ఛత్తీస్‌గఢ్‌కు తీసుకొచ్చిన పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement