తెలిసిన మనిషే కావడంతో పిలవగానే పార్కుకు వెళ్లింది.. తీరా అక్కడికి వెళ్లేటప్పటికి చీకటి పడడంతో..
ABN , First Publish Date - 2022-08-25T21:24:03+05:30 IST
ఒకే కాలనీ కావడంతో బాలికకు యువకుడితో పరిచయం ఏర్పడింది. రోజూ ఇంటికి వచ్చి పోయే క్రమంలో ఇద్దరి మధ్య మరింత చనువు పెరిగింది. అయితే ఈ పరిచయాన్నే అతను అవకాశంగా..
ఒకే కాలనీ కావడంతో బాలికకు యువకుడితో పరిచయం ఏర్పడింది. రోజూ ఇంటికి వచ్చి పోయే క్రమంలో ఇద్దరి మధ్య మరింత చనువు పెరిగింది. అయితే ఈ పరిచయాన్నే అతను అవకాశంగా తీసుకోవాలనుకున్నాడు. అనుకోకుండా ఓ రోజు మాట్లాడుకుందామంటూ పార్కుకు పిలిచాడు. అయితే అక్కడికి వెళ్లేటప్పటికి చీకటి పడింది. ఆమెతో మాట్లాడే క్రమంలో ఒక్కసారిగా అతడిలో శాడిస్టు బయటపడ్డాడు. తర్వాత జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం జైపూర్ (Jaipur) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ బాలికతో ఇరుగుపొరుగున ఉండే ఓ యువకుడు తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. ఒకే కాలనీ కావడంతో బాలిక కూడా అతడితో మాట్లాడుతూ ఉండేది. అప్పుడప్పుడూ ఇంటికి వెళ్లి వస్తూ ఉండడంతో అతన్ని బాగా నమ్మింది. ఈ క్రమంలో బాలికను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని.. అతను రోజూ వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఇటీవల ఓ రోజు ఆమెకు ఫోన్ చేసి, అర్జంట్‌గా మాట్లాడాలి.. పబ్లిక్ పార్కుకు (Public park) రావాలని పిలిచాడు. అతడి మాటలు నమ్మి.. బాలిక వెంటనే అక్కడకు వెళ్లింది.
7ఏళ్ల కూతురి ఎదుటే తండ్రి చేసిన నిర్వాకం.. ఘటన జరిగిన కాసేపటికే అతను తీసుకున్న అనూహ్య నిర్ణయంతో..
అయితే అక్కడికి వెళ్లేటప్పటికి చీకటి పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న యువకుడు.. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయట ఎవరికైనా చెబితే పరువు తీస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా రోజూ అత్యాచారానికి పాల్పడడంతో పాటూ వేధింపులు ఎక్కువవడంతో బుధవారం ఆమె.. తన తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.