Viral Video: రేస్ బైక్‌లో రయ్‌..మంటూ వచ్చాడు.. చివరకు పరువు పోగొట్టుకున్నాడు..

ABN , First Publish Date - 2022-02-04T02:44:28+05:30 IST

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఖరీదైన బైకులో గల్లీలోకి వస్తాడు. విశాలమైన ప్రదేశంలో చేయాల్సిన విన్యాసాలను గల్లీ రోడ్లపై చేయడానికి ప్రయత్నిస్తాడు. అందరి దృష్టినీ తన వైపు తిప్పుకోవాలని...

Viral Video: రేస్ బైక్‌లో రయ్‌..మంటూ వచ్చాడు.. చివరకు పరువు పోగొట్టుకున్నాడు..

ప్రస్తుతం యువత ప్యాషన్ పేరుతో వింత వింత చేష్టలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో కొందరు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇంకొందరు యువకులైతే ఖరీదైన బైకుల్లో రేసుల పేరుతో రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి రేస్ బైక్‌లో రయ్‌..మంటూ దూసుకెళ్లి, చివరకు అందరి ముందూ పరువు పోగొట్టుకున్నాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఖరీదైన బైకులో గల్లీలోకి వస్తాడు. విశాలమైన ప్రదేశంలో చేయాల్సిన విన్యాసాలను గల్లీ రోడ్లపై చేయడానికి ప్రయత్నిస్తాడు. అందరి దృష్టినీ తన వైపు తిప్పుకోవాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు. ముందు రెండు కార్లు వెళ్తున్నా.. లెక్కచేయకుండా బైకు ముందు భాగాన్ని పైకి లేపుతూ డ్రైవ్ చేస్తాడు. చివరకు రెండు కార్ల మధ్యలో ఇరుక్కుని బోర్లా పడతాడు. అయితే హెల్మెట్ ధరించడంతో అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలూ కాలేదు. పక్కనున్న వారు గమనించి కిందపడ్డ అతన్ని పైకి లేపుతారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

వందలకొద్దీ పాములను చుట్టచుట్టి సంచిలో వేసుకొచ్చాడు.. ఇతడి ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..





Updated Date - 2022-02-04T02:44:28+05:30 IST