పరీక్షలంటే భయమేసి.. ప్రియుడిని పిలిచి పారిపోదామని చెప్పింది.. అయితే దారి మధ్యలో అతడు ప్లాన్ మార్చడంతో...
ABN , First Publish Date - 2022-04-09T16:09:44+05:30 IST
కొందరు విద్యార్థులకు చదువంటే ఆసక్తి ఉన్నా.. పరీక్షలంటే చెప్పలేనంత భయం ఉంటుంది. వాటి నుంచి తప్పించుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బాలికలు...
కొందరు విద్యార్థులకు చదువంటే ఆసక్తి ఉన్నా.. పరీక్షలంటే చెప్పలేనంత భయం ఉంటుంది. వాటి నుంచి తప్పించుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బాలికలు, యువతులు.. పొరపాటున పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా కర్నాటకలో ఓ బాలికకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పరీక్షలంటే భయమేసి.. ఎలాగైనా డుమ్మా కొట్టాలనే ఉద్దేశంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రియుడిని పిలిచి పారిపోదామని చెప్పింది. అయితే దారి మధ్యలో ప్రియుడు ప్లాన్ మార్చడంతో బాలిక అవాక్కయింది. వివరాల్లోకి వెళితే..
కర్నాటకలోని మైసూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం అక్కడ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం సైన్స్ పరీక్ష ఉండగా.. సదరు బాలికకు చెప్పలేనంత భయం పుట్టుకొచ్చింది. తనకు ఈ సబ్జెక్ట్ ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో.. ఎలాగైనా పరీక్షకు డుమ్మా కొట్టాలనుకుంది. వివిధ రకాలుగా ఆలోచించి చివరకు ఓ నిర్ణయం తీసుకుంది. 11వ తరగతి చదువుతున్న తన ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇద్దరం కలిసి పారిపోదామని చెప్పడంతో అందుకు అంగీకరించాడు. ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్లే రైలు ఎక్కారు. అయితే బెంగళూరు సమీపానికి వెళ్లగానే ప్రియుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ‘‘చెన్నై వెళ్దాం.. అక్కడ నాకు తెలిసిన వాళ్లు ఉన్నారు.. అక్కడైతే ఎవరికీ ఎలాంటి అనుమానమూ రాదు’’ అని చెప్పాడు.
అతడి కాంటాక్ట్ లిస్ట్‌లో 150 మంది మహిళల పేర్లు.. నంబర్ సేకరించి రోజూ చాటింగ్.. చివరకు ఏం జరిగిందంటే..
అయితే ఉన్నట్టుండి ప్రియుడు ఇలా చెప్పడంతో బాలిక అవాక్కయింది. ‘‘నాకు చెన్నై వెళ్లడం ఇష్టం లేదు.. బెంగళూరులోనే ఉందాం’’ అంటూ సర్దిచెప్పిది. అయినా ప్రియుడు మాత్రం వినుకోలేదు. ఎలాగైనా చెన్నై వెళ్లాల్సిందే అని బలవంతం చేయడంతో బాలికకు అనుమానం కలిగింది. రైల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ను పక్కకు పిలిచి.. జరిగిన విషయం మొత్తం చెప్పింది. చెన్నైలో బాలుడికి తెలిసిన వారిని విచారించగా.. అందుబాటులోకి రాలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను చెన్నై తీసుకెళ్లి వ్యభిచారం చేయించేలా కుట్ర పన్నాడని తేలింది. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకుని, బాలికను తన తల్లిదండ్రులకు అప్పగించారు. వ్యభిచార ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.