యువత ఓటు నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-26T05:53:53+05:30 IST

18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటు నమోదు చేయించుకోవాలని తహసీల్దార్‌ పుల్లారావు పేర్కొన్నారు.

యువత ఓటు నమోదు చేసుకోవాలి
కందుకూరులో అవగాహన కల్పిస్తున్న అధికారులు

కనిగిరి, జనవరి 25: 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటు నమోదు చేయించుకోవాలని తహసీల్దార్‌ పుల్లారావు పేర్కొన్నారు. జాతీయ 12వ ఓటరు దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే ఆధారమన్నారు. దేశ పౌరునికి దేశం ఇచ్చిన గొప్ప బహుమతి ఓటు హక్కు అని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా  ఓ సీనియర్‌ సిటిజన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జునరావు, ఏపీవో నజిముద్దిన్‌, హౌసింగ్‌ ఏఈ రామనాధం, నియోజకవర్గం ఎన్నికల అఽధికారి ఎం శ్రీకాంత్‌, గుడ్‌హెల్ప్‌ రమేష్‌ పాల్గొన్నారు. 

పామూరులో : దేశంలో ఉండే వయోజనులందరికీ, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ఎంపీపీ గంగసాని లక్ష్మీ అన్నారు. మండల పరిషత్‌ ఆద్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రంగసుబ్బారాయుడు కొత్త ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో షేక్‌ ఖాజానాయబ్‌ రసూల్‌, నీరుకట్టు వేణు, షేక్‌ నాయబ్‌ రసూల్‌, ఏపీవో షేక్‌ జహీంగర్‌బాష, వర్క్‌ఇన్స్‌పెక్టర్‌ మనోహర్‌, ఉద్యానశాఖ ఎస్‌వో దీప్తి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలోని సీ.ఎస్‌.పురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లోనూ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఆయా కార్యక్రమాల్లో అధికారులు పాల్గొన్నారు.

కందుకూరులో అవగాహన ర్యాలీ

కందుకూరు : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం కందుకూరులో తహసీల్దార్‌ సీతారామయ్య ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఓటు హక్కుని సకాలంలో పొందడం, ఓటుహక్కును విధిగా సద్వినియోగం చేసుకోవటం ద్వారా ప్రజాస్యామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు క్రియాశీలంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ ఆఫీసర్‌ కేశినేని వె ంకటేశ్వర్లు సహకారంతో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్‌ సిటిజన్స్‌ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయశేఖర్‌, మున్సిపల్‌  కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగసముద్రం మండలంలో తహసీల్దార్‌ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

దొనకొండ : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండలంలో తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటు హక్కును వివరిస్తూ ప్రతిజ్ఞ చేయించారు.

దర్శి నియోజకవర్గంలోని దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు తదితర మండలాల్లోనూ ఆయా మండలాల తహసీల్దార్ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు.

Updated Date - 2022-01-26T05:53:53+05:30 IST