Abn logo
Oct 17 2021 @ 02:40AM

తిరుపతి ఆటోనగర్‌లో చోరీ

చిందరవందరగా ఉన్న బీరువాలోని వస్తువులు

40గ్రాముల నగలు, 200గ్రాముల  వెండి వస్తువులు, రూ.12వేల అపహరణ


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 16: తిరుపతి ఆటోనగర్‌లోని గ్రైండ్‌వెల్‌ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ఉద్యోగి సురేష్‌ కుటుంబం గ్రైండ్‌వెల్‌ కాలనీలో నివాసం ఉంటోంది. దసరా పండగ సందర్భంగా పది రోజుల కిందట భార్య, పిల్లలను నారాయణవనం మండలం పాలమంగళంలోని అత్తింటికి పంపారు. పండగనాడైన శుక్రవారం తాను కూడా ఇంటికి తాళంవేసి, అత్తింటికి వెళ్లారు. శనివారం సాయంత్రం సురేష్‌ సోదరి ఆయన ఇంటి వద్దకు రాగా, తలుపులు తెరిచి ఉన్నాయి. విషయాన్ని సురేష్‌కు తెలియజేయగా, ఆయన ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేశారు. 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 200గ్రాముల వెండి వస్తువులు, 12వేల రూపాయలు చోరీ అయినట్టు బాధితులు తెలిపారని సీఐ పేర్కొన్నారు.