హోమ్ ఐషోలేషన్ తర్వాత కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా?

ABN , First Publish Date - 2021-05-01T15:49:21+05:30 IST

కరోనాతో దేశం మొత్తం విలవిలలాడుతోంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ఆరోగ్య రంగంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది

హోమ్ ఐషోలేషన్ తర్వాత కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా?

కరోనాతో దేశం మొత్తం విలవిలలాడుతోంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ఆరోగ్య రంగంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. నిజానికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన అందరూ హస్పిటల్‌కు వెళ్లనవసరం లేదు. లక్షణాలు స్వల్పంగా ఉండి, ఇతర వ్యాధులు లేని వారికి హోమ్ ఐసోలేషన్ సరిపోతుంది. ఇంట్లోనే ఉంటూ వైద్యులు సూచించిన మందులు వాడుతూ రెండు వారాల్లోనే కోలుకుంటున్న వారు లక్షల్లో ఉన్నారు. అయితే `14 రోజుల హోమ్ ఐసోలేషన్‌ తర్వాత మళ్లీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా?` అనే సందేహం చాలా మందిని వెంటాడుతోంది. 


ఈ ప్రశ్నకు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా తాజాగా సమాధానం చెప్పారు. `స్పల్ప, లక్షణాలేమీ కోవిడ్ పాజిటివ్ రోగుల్లో వైరస్ ఏడు లేదా ఎనిమిదో రోజుకు చనిపోతుంది. అప్పటి నుంచి మరొకరికి వ్యాపించడమనేది ఉండదు. ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ 2-3 వారాల తర్వాత కూడా శరీరంలో వైరస్ ఉనికిని కనుగొంటుంది. కానీ, అది డెడ్ వైరస్. లక్షణాలు కనిపించిన పది రోజుల తర్వాత, మూడ్రోజుల నుంచి జ్వరం లేకపోతే రోగి హోమ్ ఐసోలేషన్‌ను ముగించవచ్చ`ని రణ్‌దీప్ చెప్పారు.   

Updated Date - 2021-05-01T15:49:21+05:30 IST