త్వరలో కరోనా నిర్ధారణ కిట్లు

ABN , First Publish Date - 2020-04-09T11:44:47+05:30 IST

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వైద్యకిట్లు త్వరలో జిల్లాకు రానున్నాయని

త్వరలో కరోనా నిర్ధారణ కిట్లు

జిల్లాలో 27కు చేరిన పాజిటివ్‌ కేసులు

కలెక్టర్‌ పోలా భాస్కర్‌  


ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 8 : కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వైద్యకిట్లు త్వరలో జిల్లాకు రానున్నాయని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వెల్లడించారు. అనుమానాస్పద కేసులను జిల్లాలోనే పరీక్షించేందుకు సౌలభ్యం కలుగుతుందని ఆయన తెలిపారు. అందుకోసం వైద్య విధాన పరిషత్‌లోని వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చామని ఆయన వివరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


జిల్లాలో బుధవారం మరోమూడు పాజిటివ్‌ కేసులు వచ్చాయని, మొత్తం 27 పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు తెలిపారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిలో ఒక్కరికే వ్యాధిసోకిందని, అతనికి మెరుగైన వైద్యం అందించడంతో పూర్తిగా కోలుకున్నాడన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 101 మంది నమూనాలు పంపితే 100 మంది ఫలితాలు వచ్చాయని, అందులో 14 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఒంగోలు, చీరాల, కందుకూరు, కనిగిరి, చీమకుర్తి పట్టణ ప్రాంతాల్లో వైరస్‌ సోకిన కేసులు అధికంగా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలైన కారంచేడు, కొనకనమిట్లలో ఐదు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒంగోలు నగరంలో 12 మందికి వ్యాధి సోకినట్లు కలెక్టర్‌ వివరించారు.


Updated Date - 2020-04-09T11:44:47+05:30 IST