హిందూపురంలో కొనసాగుతున్న కరోనా ఆందోళన

ABN , First Publish Date - 2020-04-02T10:34:08+05:30 IST

జిల్లాలోనే తొలి కరోనా పాజిటివ్‌ కేసులు హిందూపురం, లేపాక్షిలో నమోదైన నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

హిందూపురంలో కొనసాగుతున్న కరోనా ఆందోళన

పట్టణం దిగ్బంధం.. 

అయినా రోడ్లపైకి ప్రజలు

కన్పించని భౌతిక దూరం 


హిందూపురం, ఏప్రిల్‌ 1:  జిల్లాలోనే తొలి కరోనా పాజిటివ్‌ కేసులు హిందూపురం, లేపాక్షిలో నమోదైన నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. జిల్లాయంత్రాంగం కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అధికార యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. హిందూపురంతోపాటు లేపాక్షిలో అత్యవసరం ఉంటే తప్ప అనవసరంగా ఎవరు బయట తిరగొద్దని, వస్తే భౌతిక దూరం తప్పక పాటించాలని మైకుల్లో హెచ్చరికలు జారీ చేశారు. అయినా హిందూపురంలో మాత్రం నిత్యావసర కొనుగోళ్లు కోసం జనం ఎగబడ్డారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించ కుండా విచ్చలవిడిగా తిరిగారు. ప్రధానంగా ఎంజీఎంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కె ట్‌తోపాటు పండ్లు మార్కెట్‌, సూ పర్‌ మార్కెట్ల్‌లో ఉదయం జనం గుంపులు గుంపులుగా వచ్చి కొనుగోళ్లు చేశారు.


గురువారం శ్రీరామనవమి కావ డంతో గ్రామాల నుంచి భారీగా జనం బయటకు వచ్చారు. దీంతో పోలీసులు ఉదయం 9 గంటల నుంచి పట్ట ణంలోకి వచ్చే వారికి అనుమతి నిరాకరించినా అడ్డదారుల్లో  జనం చేరుకున్నారు. కొనుగోళ్లు సమయం ముగిసినా జనం రోడ్లపై కన్పించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సివచ్చింది. కొందరు యువత కాలనీల్లో నుంచి ద్విచక్రవాహనాల్లో అనవసరంగా తిరిగారు. కరోనా పాజి టివ్‌ కేసుల నమోదుతో హిందూపురం, లేపాక్షిలో భయాందోళన రేకెత్తి కొందరు ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు  జంకుతున్నా మరికొందరు మాత్రం అదేమిపట ్టనట్లు వ్యవహరించారు. హిందూపురం లోని టిప్పుఖాన్‌స్ర్టీట్‌ను దిగ్బంధం చేసి అన్నిచోట్ల పారిశుధ్యం, స్ర్పేలను చల్లి శుద్ధి చేస్తున్నారు. 


 కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో వైద్యబృందాలతో ఇంటింటి సర్వే

 రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో హిందూపురం, లేపాక్షిలో వైద్యఆరోగ్యశాఖ జల్లెడ పడుతోంది. పట్టణంతోపాటు లేపాక్షిలో వైద్యబృందాలతో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ప్రధానంగా మక్కాకు వెళ్లివచ్చిన కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఎవరితో కలిశారో ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో నిజాముద్దీన్‌ తబ్లిగ్‌ ఏ జమాత్‌ సంస్థ నిర్వహించిన మతపరమైన కార్యక్రమానికి హిందూపురం నుంచి హాజరై తిరిగివచ్చిన 16 మందిని ఇప్పటికే గుర్తించి అనంతపురంలోని క్వారంటైన్‌లో ఉంచారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారు హిందూపురంతో పాటు ఎక్కడెక్కడకి వెళ్లారు, ఎవరితో కలిశారు అనే వాటిపై లోతుగా సర్వే చేపడుతున్నారు. ఇప్పటికే మక్కాకు వెళ్లి వచ్చినా హిందూపురం క్వారంటైన్‌లో ఉన్నవారితో 149 మంది దగ్గరగా కాంటాక్ట్‌ అయినట్లు గుర్తించారు.


వీరిలో ఆరుగురితో పాటు, ఇటీవలే ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన మలుగూరుకు చెందిన ఓయువకుడి రక్త నమూనాలను పరీక్షలకు పంపారు. బుధవారం కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదై మృతి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలికి చెందిన బంధువుల్లో  హిందూపురంలో ఉండే 9 మందికి రక్తనమూనాలు సేక రించి  ల్యాబ్‌కు పంపారు. వీరికి సంబం ధించిన రిపోర్టు గురువారం వచ్చే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన పదేళ్ల బాలుడితోపాటు హిందూపు రంలోని టిప్పుఖాన్‌స్ర్టీట్‌లో బయటపడిన 34 ఏళ్ల మహిళ కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు వారు ఎవరితో కలిశారో ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-04-02T10:34:08+05:30 IST