హనుమంతుడి జన్మస్థానం తిరుమలే!

ABN , First Publish Date - 2021-04-09T07:33:50+05:30 IST

హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల.. హనుమంతుడి జన్మస్థానమని నిరూపించేందుకు టీటీడీ సన్నద్ధమైంది. ఈ నెల 13న ఉగాది నాడు పురాణాలు, శాసనాలు, శాస్ర్తీయ ఆధారాలతో రుజువు

హనుమంతుడి జన్మస్థానం తిరుమలే!

అంజనాద్రిలోనే పుట్టాడు.. పండితుల కమిటీ నిర్ధారణ

ఉగాదినాడు ఆధారాలతో నిరూపించనున్న టీటీడీ కమిటీ


తిరుపతి (కల్చరల్‌), ఏప్రిల్‌ 8: హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల.. హనుమంతుడి జన్మస్థానమని నిరూపించేందుకు టీటీడీ సన్నద్ధమైంది. ఈ నెల 13న ఉగాది నాడు పురాణాలు, శాసనాలు, శాస్ర్తీయ ఆధారాలతో రుజువు చేయబోతోంది. ఈ వ్యవహారంపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో జవహర్‌రెడ్డి గురువారం సమీక్ష జరిపారు. అంజనాద్రి కొండపై హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో నిరూపించేందుకు 2020 డిసెంబరులో టీటీడీ పండితులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కమిటీ పరిశోధించి హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు ఆధారాలు సేకరించింది. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్యం గ్రంఽథం, వరాహ మిహిరుడి బృహత్‌సంహిత గ్రంఽథాల ఆధారంగా సప్తగిరుల్లో ఒకటైన అంజనాద్రి కొండే ఆంజనేయుడి జన్మస్థానమని నిర్ధారణకు  వచ్చారు. ఈ నేపథ్యంలో జరిగిన సమీక్షలో ఈవో మాట్లాడుతూ.. కమిటీలోని పండితులు శాస్త్రీయ ఆధారాలతో ఉగాదినాడు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు.

Updated Date - 2021-04-09T07:33:50+05:30 IST