Viral Video: ప్రాణాల మీద ఆశలు వదులుకున్న సమయంలో.. మృత్యుంజయుడు అవుతానని అతను ఊహించి ఉండడు..

ABN , First Publish Date - 2022-02-26T02:11:15+05:30 IST

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ యువకుడు కూడా మృత్యువు అంచుల్లోకి వెళ్లి.. అనూహ్యంగా మృత్యుంజయుడిలా తిరిగి వచ్చాడు. పర్వతారోహణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది...

Viral Video: ప్రాణాల మీద ఆశలు వదులుకున్న సమయంలో.. మృత్యుంజయుడు అవుతానని అతను ఊహించి ఉండడు..

అదృష్టం ఉండాలే గానీ ఎంత పెద్ద ప్రమాదం జరిగినా చిన్న పాటి గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడొచ్చు. కొందరైతే తీరా ప్రాణాల మీద ఆశలు వదులుకున్న సందర్భాల్లో కూడా.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మృత్యుంజయుడిలా తిరిగి వస్తుంటారు. ‘‘వీడి లక్కే.. లక్కురా’’.. అని అలాంటి సందర్భాల్లోనే అంతా అంటూ ఉంటారు. ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ యువకుడు కూడా మృత్యువు అంచుల్లోకి వెళ్లి.. అనూహ్యంగా మృత్యుంజయుడిలా తిరిగి వచ్చాడు. పర్వతారోహణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఘటన వివరాల్లోకి  వెళితే..


కొలరాడోకు చెందిన లేలాండ్ నిస్కీకి పర్వాతరోహణ అంటే హాబీ. గతంలో ఎన్నో సాహసాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 8న ఒరేలోని ది రిబ్బన్ పర్వత శిఖరాన్ని అధిరోహించడానికి ఒంటరిగా వెళ్లాడు. భూమి నుంచి 400 అడుగుల ఎత్తులో ఉండగా అనుకోని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా హిమపాతం సంభవించింది. ఆ సమయంలో అతడికి ఎలాంటి భద్రతా సౌకర్యాలూ లేవు. ఇక తన పని అయిపోయిందని అనుకున్నాడు. కానీ వెంటనే తేరుకుని.. ఎలాగైనా ప్రమాదం నుంచి బయటపడాలని ఉన్న శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నించాడు. తన వద్ద ఉన్న గొడ్డలి సాయంతో పర్వతాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈ హిమపాతం రెండు నిమిషాల పాటు సంభవించింది. అంతసేపు ఓపికగా ధైర్యంతో అలాగే ఉన్నాడు. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి హెల్మెట్‌కు ఉన్న కెమెరాలో ఇదంతా రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అతడి ధైర్యసాహసాలను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

పెళ్లిలో దండలు మార్చుకుంటారని తెలుసు గానీ.. మరీ ఇలా మార్చుకుంటారని.. ఎవ్వరూ ఊహించి ఉండరు..





Updated Date - 2022-02-26T02:11:15+05:30 IST