బస్సు రన్నింగ్‌లో ఉండగా.. సడన్‌గా స్పృహ తప్పిన డ్రైవర్.. అంతా భయాందోళనలో ఉండగా ఓ మహిళ పైకి లేచి..

ABN , First Publish Date - 2022-03-10T00:48:51+05:30 IST

ఓ బృందం పూణేకు బస్సులో వెళ్లి వస్తోంది. మార్గమధ్యంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా..

బస్సు రన్నింగ్‌లో ఉండగా.. సడన్‌గా స్పృహ తప్పిన డ్రైవర్.. అంతా భయాందోళనలో ఉండగా ఓ మహిళ పైకి లేచి..

అనుకోని ప్రమాదాలు జరిగే సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి సమయంలోనే ఎవరూ ఊహించని విధంగా ప్రమాదం నుంచి అంతా సురక్షితంగా బయటపడుతుంటారు. ఇలా జరిగినప్పుడు ఇది కలా.. నిజమా.. అని అంతా అనుకుంటూ ఉంటారు. ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బృందం పూణేకు బస్సులో వెళ్లి వస్తోంది. మార్గమధ్యంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చాలా మంది ప్రాణాల మీద ఆశలు వదులుకున్నారు. అయితే ఇంతలో ఓ మహిళ పైకి లేచి వెళ్లింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


విహారయాత్ర నిమిత్తం ఓ బస్సులో 20మంది మహిళలు, 8మంది చిన్నారులతో జనవరి 7న మహారాష్ట్ర పూణేలోని మొరాచి చించోల్‌ అనే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అంతా చూసిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో అంతా మాటల్లో ఉండగా.. ఒక్కసారిగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి డ్రైవర్ స్పృహ తప్పి పడిపోవడంతో బస్సు అటూ ఇటూ వెళ్లడం ప్రారంభించింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయంతో కేకలు పెట్టారు. వారికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొందరైతే తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఇంతలో యోగిత ధర్మేంద్ర సతవ్ అనే మహిళ సడన్‌గా పైకి లేచింది. వేగంగా డ్రైవర్ వద్దకు వెళ్లింది. ముందుగా స్టీరింగ్‌ను కంట్రోల్ చేసి బస్సును చాకచక్యంగా కంట్రోల్ చేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మహిళలు ఆటో నడుపుతున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? వీళ్ల నిర్ణయం వెనుక..


అనంతరం డ్రైవర్‌ మొఖం మీద నీళ్లు చల్లినా లేవలేదు. దీంతో తనే డ్రైవింగ్ సీట్లో కూర్చుని బస్సును స్టార్ట్ చేసింది. పూణెకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిక్రాపూర్ పట్టణంలోని ఆసుపత్రి వరకూ వాహనాన్ని సరక్షితంగా తీసుకెళ్లింది. సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. సరైన సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించిన మహిళను ప్రయాణికులతో పాటూ స్థానికులంతా అభినందనలతో ముంచెత్తారు. యోగిత మాట్లాడుతూ తనకు 20 ఏళ్లుగా వివిధ వాహనాలను నడిపిన అనుభవం ఉందని చెప్పింది. అయితే బస్సును మాత్రం ఎప్పుడూ నడపలేదని, ప్రమాద సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో నడపాల్సి వచ్చిందని తెలిపింది. యోగిత ధైర్యసాహసాలపై కొటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ.. ఓ య్యాడ్ ఫిలిం రూపొందించింది. ఈ వీడియో వైరల్ అవడంతో యోగిత ధైర్యసాహసాలపై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆ ఊర్లో ఆడవారిదే పెద్దరికం.. అన్ని ఇళ్లూ వారివే.. ఇంతకీ ఆ ఊరెక్కడుందో తెలుసా..



Updated Date - 2022-03-10T00:48:51+05:30 IST