కేంద్ర మంత్రి కుమార్తె.. కరోనా వారియర్.. ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2021-04-27T23:54:05+05:30 IST

కరోనా వారియర్‌గా మారిన కేంద్ర మంత్రి కుమార్తెపై ప్రశంసల వర్షం

కేంద్ర మంత్రి కుమార్తె.. కరోనా వారియర్.. ప్రశంసల వర్షం

న్యూఢిల్లీ: కరోనా ధాటికి తల్లడిల్లిపోతున్న రోగులకు భరోసా ఇచ్చే ఒకే ఒక పేరు డాక్టర్.. ఏం భయం లేదు..తగ్గిపోతుంది అన్న వైద్యుడి మాటలు వింటే రోగులకు కొండంత బలం..! నన్ను బతికించావ్..నూరేళ్లు చల్లగా ఉండు అంటూ కరోనా నుంచి కోలుకున్న వారు డాక్టర్లను నిండుమనసుతో దీవిస్తారు. ఇక కరోనా వారియర్లు చేస్తున్న నిస్వార్థ సేవ చూసి వారి తల్లిదండ్రులు సంతోషానికి అవధులే ఉండవు. అందుకే.. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కుమార్తె దిశా వైద్య విద్య చివరి సంవత్సరంలో ఉన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఓ యోధురాలిగా(వారియర్‌గా) కొవిడ్ పేషెంట్లకు సేవ చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. ‘‘నా కుమార్తె..నాకు గర్వకారణం.. దిశా..నువ్వు ఈ బాధ్యత నిర్వహిస్తుండగా చూడాలని ఎంతో కాలం వేచి చూశా. ప్రస్తుత విపత్కర స్థితిలో నువ్వు ఓ ఇంటర్న్‌గా నీ బాధ్యత నిర్వహిస్తుండటం నాకు ఎంతో గర్వకారణం. నువ్వు చేసే సేవ దేశానికి ఎంతో అవసరం. ఈ క్రమంలో నిన్ను నువ్వు నిరూపించుకుంటావని నేను బలంగా నమ్ముతున్నాను. నువ్వు మరింత శక్తిమంతురాలికి కావాలి వారియర్!’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. పీపీఈ కిట్‌ ధరించిన తన కుమార్తె ఫొటోను కూడా షేర్ చేశారు. దీంతో..నెటిజన్లు దిశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్‌కు దాదాపు 40 వేల లైకులు, రీట్వీట్లు వచ్చి పడ్డాయి. 



Updated Date - 2021-04-27T23:54:05+05:30 IST