ప్రముఖ సంస్థ డియోట్టాతో థాట్‌స్పాట్ ఒప్పందం
ABN , First Publish Date - 2021-05-05T22:48:07+05:30 IST
ప్రముఖ సంస్థ డియోట్టాతో థాట్‌స్పాట్ ఒప్పందం
హైదరాబాద్: ఆధునిక ఎనలిటిక్స్ క్లౌడ్ కంపెనీ థాట్‌స్పాట్ నేడు తాము మోడ్రన్ డాటా ఇంటిగ్రేషన్ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ డియోట్టాను సొంతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఎక్వైజేషన్‌తో ఉత్తర అమెరికా మరియు భారతదేశాలలోని 60 మందికి పైగా నూతన ఉద్యోగులు థాట్‌స్పాట్‌లో చేరడంతో పాటుగా మోడ్రన్ ఎనలిటిక్స్ క్లౌడ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయనున్నారు. అంతేకాకుండా సంస్థ అంతర్జాతీయ ఆర్ అండ్ డీ బృందానికి 25 శాతం అదనపు ఉద్యోగులు జోడించబడడంతో పాటుగా భారతదేశంలోని ఆర్ అండ్ డీ బృందానికి 50శాతం అదనపు ఉద్యోగులు ఉండనున్నారు. దీనితో పాటుగా హైదరాబాద్‌లో సంస్థ తమ పాదముద్రికలను విస్తరించనుంది. థాట్‌స్పాట్‌కు ఇప్పుడు భారతదేశంలో 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వినియోగదారుల ఆధునిక డాటా స్టాక్‌లో అత్యుత్తమ సేవలతో థాట్‌స్పాట్ వేగంగా తమ అనుసంధానతలను విస్తరించేందుకు డియోట్టాతో నూతన అనుబంధం తోడ్పడుతుంది.