గుట్కాలు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2020-09-27T09:45:11+05:30 IST

నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మార్కెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో

గుట్కాలు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

రెజిమెంటల్‌ బజార్‌, సెప్టెంబర్‌ 26(ఆంధ్రజ్యోతి): నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మార్కెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో రూ.1.40 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. మోండా మార్కెట్‌లో నవీన్‌కుమార్‌ పూజాస్టోర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇదేషాపులో నల్లగుట్టకు కాచిబోలికి చెందిన మేకల సాయిరాం(23) పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో గుట్కాలను అమ్మడం మొదలు పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో మార్కెట్‌ పోలీసులు షాపులో తనిఖీ చేయగా లక్షా ఇరవై వేల విలువ చేసే వివిధ రకాల పేరుతో ఉన్న గుట్కా ప్యాకెట్లు లభించాయి. సాయిరాంను అరెస్టు చేయగా నవీన్‌ కుమార్‌ పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదేప్రాంతంలో కిట్స్‌ పేరుతో షాపును నిర్వహిస్తున్న బిజోరియా దీపక్‌(60), అందులో పని చేస్తున్న దోర్నాక కిరణ్‌ కూడా గుట్కాలు విక్రయిస్తుండటంతో పోలీసులు షాపు దాడి చేసి రూ.20 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు  స్వాధీనం చేసుకున్నారు. బిజోరియా దీపక్‌, దోర్నాక కిరణ్‌ను అరెస్టు చేశారు. 

Updated Date - 2020-09-27T09:45:11+05:30 IST