Abn logo
Aug 5 2020 @ 04:39AM

ఉద్యమం ఉవ్వెత్తున..

ఆంధ్రజ్యోతి, విజయవాడ: మూడు రాజధానుల నిర్ణయంపై రైతులు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. తుళ్లూరు, వెలగపూడి, మందడం, పెదపరిమి గ్రామాల్లో రైతు దీక్షా శిబిరంలో నిరసనలు ఉధృతమవుతున్నాయి. అమరావతి నుంచే పాలన సాగాలని ప్లకార్డులు పట్టుకుని రైతులు, మహిళలు, కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. పోరాటంలో ధర్మదేవత తమ వైపే ఉండాలని కోరుతూ మంగళవారం పలుచోట్ల హనుమాన్‌ చాలీసా పఠనం చేశారు. ‘అమరావతిని రక్షించండి.. ఏపీని కాపాడండి’ అని రైతులు, మహిళలు.. హైకోర్టుకు వెళ్లే రహదారుల్లో న్యాయమూర్తులకు దండాలు పెట్టి వేడుకున్నారు. మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్‌ సంతకానికి వ్యతిరేకంగా గుంటూరులో  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన చేశారు.          

 

Advertisement
Advertisement
Advertisement