Abn logo
Aug 4 2021 @ 07:04AM

మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం

పెరంబూర్‌(చెన్నై): నైరుతి రుతుపవనాల కారణంగా రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో, బుధవారం నుంచి మూడు రోజులు కోయంబత్తూర్‌, నీలగిరి, సముద్రతీర జిల్లాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందన్నారు. చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘా వృతంగా ఉంటూ సాయంత్రం, రాత్రి సమయాల్లో స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశ ముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.