Russian దాడుల్లో 352మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారు...

ABN , First Publish Date - 2022-02-28T13:08:29+05:30 IST

రష్యా దాడిలో 14 మంది చిన్నారులు సహా 352 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది...

Russian దాడుల్లో 352మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారు...

అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడి

కీవ్: రష్యా దాడిలో 14 మంది చిన్నారులు సహా 352 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా సైనికుల దాడుల్లో 116 మంది చిన్నారులు సహా మరో 1,684 మంది గాయపడ్డారని తెలిపింది.కాగా తమ దళాలు ఉక్రెయిన్ సైనిక ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ దేశంలో పౌరులు ప్రమాదంలో లేరని రష్యా పేర్కొంది.రష్యా తన సైనికుల మరణాలపై ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం మాత్రమే రష్యా సైనికులు మరణించారని అంగీకరించింది.మరో వైపు బెలారస్ అణురహిత హోదాను రద్దు చేసింది. రష్యా అణ్వాయుధాలను ఉంచడానికి బెలారస్ మార్గాన్ని సుగమం చేసింది. 


Updated Date - 2022-02-28T13:08:29+05:30 IST