భూ ఆక్రమణలకు పాల్పడిన ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2021-01-26T06:12:42+05:30 IST

పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భూ ఆక్రమణలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు నార్త్‌ జోన్‌ ఏసీపీ రవిశంకరరెడ్డి తెలిపారు.

భూ ఆక్రమణలకు పాల్పడిన ముగ్గురి అరెస్టు
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రవిశంకరరెడ్డి

నార్త్‌ జోన్‌ ఏసీపీ రవిశంకరరెడ్డి

కొమ్మాది, జనవరి 25: పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భూ ఆక్రమణలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు నార్త్‌ జోన్‌ ఏసీపీ రవిశంకరరెడ్డి తెలిపారు. సోమవారం పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొట్టవాని పాలెం సర్వేనంబర్‌ 60/5, 60/6లో ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తున్న గొలగాని కనకరాజు అనే వ్యక్తికి కొంత స్థలం ఉందని, దీనిని మధురవాడకు చెందిన ముగ్గురు ఆక్రమించేందుకు యత్నించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు ఆ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కనకరాజు ఉద్యోగ రీత్యా స్థానికంగా లేకపోవడంతో ఆయన స్థలంలో ముద్దాయిలు కోడిగుడ్ల వెంకటరమణ,పాచి రమేశ్‌, పోతిన జయబాలకృష్ణలు సర్వే రాళ్లను తొలగించి పొక్లయినర్‌తో స్థలాన్ని చదును చేశారు. అలాగే ఆ పక్కనే ఉన్న నెల్లి రామారావు అనే వ్యక్తికి చెందిన స్థలంలో ప్రహరీని నిర్మించడంతో ఈ స్థలం తమదంటూ బెదిరించారన్నారు. కనకరాజు ఫిర్యాదు మేరకు ఏసీపీ రవిశంకరరెడ్డి ఆధ్వ ర్యంలో పీఎం పాలెం సీఐ రవికుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేసి ముద్దాయిలు ముగ్గురిని సోమవారం అరెస్టు చేసి ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్టులో రిమాండ్‌ నిమిత్తం హాజరు పరిచారు. మధురవాడ పరిధిలో భూ ఆక్రమణలపై నిఘా పెట్టామని, ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలకు యత్నిస్తే కఠనమైన చర్యలు తీసుకుంటామని రవిశంకరరెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2021-01-26T06:12:42+05:30 IST