Abn logo
Mar 5 2021 @ 17:07PM

టైం మ్యాగజైన్ కవర్ ఫొటోపై మహిళా రైతుల ఆందోళన

న్యూఢిల్లీ: ప్రఖ్యాత టైం మ్యాగజైన్‌ తాజా కవర్‌ ఫొటోగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన మహిళా రైతులను తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహిళా రైతులు నినదిస్తున్నట్లు ఉన్న చిత్రాన్ని కవర్ ఫొటోగా ముద్రించారు. ఆ కవర్‌ ఫొటోపై ‘ఇండియాలో జరుగుతున్న రైతు ఆందోళనలో ముందు వరుసలో ఉన్నవారు’ అని టైం రాసుకొచ్చింది. నిరసన విరమించి ఇంటికి వెళ్లమని ప్రభుత్వం సూచించినప్పటికీ పోరాట స్ఫూర్తితో వారు కొనసాగిస్తున్న ఆందోళనను ప్రముఖంగా పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ నిరసనకు ప్రపంచ వ్యాప్తంగా పలువురి నుంచి వచ్చిన మద్దతు గురించి ప్రస్తావించారు. రిహన్నా, గ్రెటా లాంటి వారు చేసిన ట్వీట్లను ఊటంకించారు. ఇక టైం మ్యాగజైన్ కవర్ ఫొటోను టైం మ్యాగజైన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఎవరికి తలొగ్గం, ఎవరికీ అమ్ముడు పోం’’ అని ట్వీట్ చేశారు.