గిరిజనులపై కేసులు పెట్టడం అన్యాయం: కోదండరాం

ABN , First Publish Date - 2021-08-09T17:57:56+05:30 IST

హైదరాబాదు: పోడు భూములను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం.. గిరిజనులపై కేసులు నమోదు చేయటం అన్యాయమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు.

గిరిజనులపై కేసులు పెట్టడం అన్యాయం: కోదండరాం

హైదరాబాదు: పోడు భూములను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం.. గిరిజనులపై కేసులు నమోదు చేయటం అన్యాయమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. గిరిజన దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో గిరిజనులు ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిండి కోసం ఆదివాసీయులు అప్పులు చేయడం బాధాకరమన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆహారభద్రత కోసం మాత్రమే గిరిజనులు భూమి అడుగుతున్నారని గుర్తుచేశారు. గిరిజన దినోత్సవం సందర్భంగా వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే అనుకూల ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-09T17:57:56+05:30 IST