Abn logo
Oct 30 2020 @ 06:34AM

ఉపాధి ఫీల్డ్‌ అసిస్ట్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి

తాళ్లపూడి, అక్టోబరు 29  : పెద్దేవం ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసి స్టెంట్‌ అవకతవకలకు పాల్పడుతున్నాడని తమకు న్యాయం చేసి తగిన చర్యలు తీసుకోవాలని కొంతమంది ఉపాధి హామీ కూలీలు కోరారు. ఈ మేరకు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో ఎం. రాజశేఖర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తిగిరిపల్లి వేణు తనకు కావాల్సిన వ్యక్తులు పనిలోకి రాకపోయినా మస్తరు వేసి కూలి పనుల సొమ్మును పంచుతున్నాడని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement