నేడు కామారెడ్డికి సీఎం కేసీఆర్‌ రాక

ABN , First Publish Date - 2021-06-20T05:56:29+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, పోలీసు భవనాలను సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యా హ్నం 2.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇ ప్పటికే పూర్తిచేశారు.

నేడు కామారెడ్డికి సీఎం కేసీఆర్‌ రాక
ప్రారంభానికి ముస్తాబైన కామారెడ్డి నూతన సమీకృత కలెక్టరేట్‌

నూతన కలెక్టరేట్‌, పోలీసు భవనాల ప్రారంభం
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

కామారెడ్డి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, పోలీసు భవనాలను సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యా హ్నం 2.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇ ప్పటికే పూర్తిచేశారు. నూతన కలెక్టరేట్‌ భవనాన్ని సుం దరంగా తీర్చిదిద్దారు. కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించి న అనంతరం సమావేశ హాల్‌లో జిల్లా ప్రజాప్రతినిధు లు, అధికార యంత్రాంగంతో సీఎం కేసీఆర్‌ సమీక్ష స మావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా భిక్కనూ రు మండలంలోని జంగంపల్లిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ను ప్రారంభించే అవకాశం ఉంది. అదేవిధంగా సమీపంలోని ఏదైనా గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులను సీఎం పర్యవేక్షించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి సంబ ంధించి 1500 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంఽధించి శనివారం కలెక్టర్‌ శరత్‌, నిజామాబాద్‌ పోలీసు క మిషనర్‌ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి బందోబస్తును పరిశీలించారు.

Updated Date - 2021-06-20T05:56:29+05:30 IST