లాక్‌డౌన్‌పై రేపు నిర్ణయం తీసుకోనున్న సీఎం?

ABN , First Publish Date - 2020-05-28T15:23:51+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగించాలా వద్దా అనే విషయంపై ఈనెల 29న ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మంగళవారం జరిగిన సమావేశం..

లాక్‌డౌన్‌పై రేపు నిర్ణయం తీసుకోనున్న సీఎం?

చెన్నై: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగించాలా వద్దా అనే విషయంపై ఈనెల 29న ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మంగళవారం జరిగిన  సమావేశంలో వైద్యనిపుణుల కమిటీ మెజారిటీ సభ్యులు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని సిఫారసు చేశారు. ఆ సమావేశానంతరం కమిటీ సభ్యులెవరూ మీడియా ప్రతినిధులను కలవకుండా వెళ్ళిపోయారు. దీంతో లాక్‌డౌన్‌పై ప్రభుత్వ నిర్ణయం ఏమిటో ఎవరికీ తెలియక సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకుగాను ముఖ్యమంత్రి పళనిస్వామి జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. 


ఈ నెల 29 ఉదయం సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్షరెన్సింగ్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరుపనున్నారు. ఈ నెల 31తో నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగియనుంది. మూడో విడత లాక్‌డౌన్‌ ముగియనప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రభుత్వం  వరుసగా సడలింపులను ప్రకటిస్తూ వచ్చింది. మద్యం దుకాణాలను తెరవడం. పారిశ్రామికవాడల పునఃప్రారంభానికి అనుమతించింది. అన్ని దుకాణాలను తెరిచేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముఖ్యంగా రవాణా సంస్థ బస్‌ సర్వీసులను మాత్రం నడుపలేదు. ఈ పరిస్థితులలో ఐదో విడతగా లాక్‌డౌన్‌ అమలు చేసే విషయమై సీఎం జిల్లా కలెక్టర్లతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ రవాణా సంస్థ బస్‌ సర్వీసులను క్రమంగా పునరు ద్ధరించాలని ఎడప్పాడి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-05-28T15:23:51+05:30 IST