మరీ ఇంత నిర్లక్ష్యమా ?

ABN , First Publish Date - 2022-06-04T04:43:33+05:30 IST

ఇంటిపన్ను వసూలు, పారిశుధ్య పనుల నిర్వహణ నిర్లక్ష్యంపై సంబంధిత శాఖ అధికారుల తీరుపై కలెక్టర్‌ వెంకట్‌రావు మండిపడ్డారు.

మరీ ఇంత నిర్లక్ష్యమా ?
మురుగునీటి కాలువలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు


- పల్లెప్రగతిలో అఽధికారులపై కలెక్టర్‌ వెంకట్రావు ఆగ్రహం

- ఇంటిపన్ను వసూలు, పారిశుధ్య పనుల నిర్లక్ష్యంపై సీరియస్‌ 


మహమ్మదాబాద్‌, జూన్‌ 3  : ఇంటిపన్ను వసూలు, పారిశుధ్య పనుల నిర్వహణ నిర్లక్ష్యంపై సంబంధిత శాఖ అధికారుల తీరుపై కలెక్టర్‌ వెంకట్‌రావు మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ దగ్గర నిర్వహించిన పల్లె ప్రగతి సభకు హాజరై మాట్లాడారు. పారిశుధ్యం, హరితహారం  వంటి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నారు. పరిశుభ్రమైన వాతావ రణం, స్వచ్ఛమైన తాగునీరు తీసుకున్నట్లయితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. మురికికాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛమైన తాగునీరు తీసుకోవాలని సూచించారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించా లన్నారు. మహమ్మదాబాద్‌ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చుదిద్దేం దుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పాఠశాల విద్య, రైతు వేదికలు, గ్రామ పంచాయతీల పనితీరు, పారిశుధ్యం, ఉపాధిహామీ తది తర అంశాలపై ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాంకొండ కాలనీలో తాగునీరు సరిగా రావ డం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులు వెంటనే సమస్య పరిష్కరించే విధంగా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ వీధుల్లో తి రుగుతూ పారిశుధ్యం, మురుగునీటి కాలువలను పరిశీ లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పార్వతమ్మ, డీటీటీవో చత్రునాయక్‌, తహసీల్లార్‌ ఆంజనేయులు, ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, ఎంపీవోదశరథ్‌ పాల్గొన్నారు 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

గండీడ్‌ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేకాధికారి దశరథ్‌, ఎంపీపీ మాధవి, జడ్పీ టీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పల్లెప్రగతి కార్యక్ర మంలో భాగంగా కొంరెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి,  గ్రామాల్లో మొదటి రోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ సంద ర్భంగావారు మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తాచెదారాన్ని, నీటి నిల్వ కుంటను పూడ్చివేయాలని సూచించారు. కార్యక్రమంలో కోఆప్షన్‌ సభ్యుడు సలీం, తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, సర్పంచులు ప్రభాకర్‌ రెడ్డి, గోపాల్‌, ఎంపీటీసీ రాధ, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉడిత్యాలలో ప్రారంభం 

బాలానగర్‌ : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలలో ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని శుక్రవారం జడ్పీటీసీ సభ్యురాలు కళ్యాణి ప్రారంభించారు. ఉడిత్యాల గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామాల్లో డ్రైనేజీ పనులు, చెత్తాచెదారం లేకుండా గ్రామాన్ని శుభ్రంగా ఉంచితేనే అంటురోగాలు ప్రభలవన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మన్‌ నాయక్‌, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. 

ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలి 

బాదేపల్లి : పట్టణ ప్రగతిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో నాలుగవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్‌ మహమూద్‌షేక్‌, కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, వార్డు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. 

పకడ్బందీగా నిర్వహించాలి : ఎంపీపీ సుశీల

రాజాపూర్‌ : గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహిం చాలని ఎంపీపీ సుశీల నాయక్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఖానాపూర్‌ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో లక్ష్మీదేవితో కలిసి ఎంపీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల కేంద్రం తో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతి నిధులు పాల్గొని పల్లెప్రగతి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, ప్రత్యేకాధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు

Updated Date - 2022-06-04T04:43:33+05:30 IST