అన్నదాతపై ని‘వార్‌’

ABN , First Publish Date - 2020-11-28T05:40:31+05:30 IST

నివర్‌ తుఫాన్‌ జిల్లావాసులను వణికిం చింది. రెండు రోజులుగా ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. అన్న దాతలపై పగబట్టి వారికి కన్నీటిని మిగి ల్చింది. సుమారు రూ.54 కోట్ల విలువైన పంటను ముంచేసింది. వరుస దెబ్బలతో కోలుకోలేని దెబ్బ తీసింది.

అన్నదాతపై ని‘వార్‌’
పెదపాడు మండలం నాయుడుగూడెంలో తడిచిన వరి పనలు చూపుతున్న రైతు

పంట నష్టం.. రూ.54 కోట్లు!

వరి, పత్తి, మినుము రైతులకు పెద్ద దెబ్బ

20 వేల హెక్టార్లలో నీట మునిగిన వరి  

ఆచంటలో అత్యధిక వర్షపాతం 

దెబ్బతిన్న రోడ్లు

చలి గాలులతో జనం బెంబేలు


నివర్‌ తుఫాన్‌ జిల్లావాసులను వణికిం చింది. రెండు రోజులుగా ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. అన్న దాతలపై పగబట్టి వారికి కన్నీటిని మిగి ల్చింది. సుమారు రూ.54 కోట్ల విలువైన పంటను ముంచేసింది. వరుస దెబ్బలతో కోలుకోలేని దెబ్బ తీసింది.


ఏలూరు సిటీ, నవంబరు 27 : జిల్లాపై నివర్‌ తుఫాన్‌ తీవ్ర ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు సార్వా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి పంట సర్వనాశనమైంది. కోతకొచ్చిన వరి చేలు గాలులకు నేలకొరిగాయి. భారీ వర్షానికి నేలనంటిన పనలు ముంపునకు గురయ్యాయి. నీరు బయటకు వెడితేనే గాని పరిస్థితి ఏమిటన్నది తెలియదు. నిన్నటి వరకు ప్రాణపదంగా కాపాడుకొచ్చిన పంట ఒక్కసారిగా నీట మునగ డంతో రైతుల కన్నీరు ఆగడం లేదు. కొందరు నేలనంటిన వరిని కట్టలుగా కడుతుండగా, మరికొందరు చేలల్లో నీటిని బయటకు పంపుతున్నారు. మరోవైపు మాసూళ్లు చేసిన ధాన్యం రాశులపైకి బరకాల పరదాలను దాటి నీరు ప్రవేశించింది. చాలాచోట్ల ధాన్యం ముద్ద ముద్దయ్యింది. చేతి వరకూ వచ్చిన ముద్ద నోటికందని చందాన తయారైంది వీరి పరిస్థితి. నేల వాలిన చేను గింజ పాలు పోసుకోక మొలకలు వస్తున్నాయి. నీట మునిగిన కంకులు మొలకెత్తడంతో పంటను మాసూళ్లు చేసుకోవడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. పశుగ్రాసానికి కూడా పంట ఉపయోగపడదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి మాసూళ్లు నలభై శాతం మాత్రమే పూర్తి కాగా మిగిలిన పంట నీటిపాలైంది. కోసి ఆరబెట్టుకుంటుంటే ఆ ధాన్యం ఇంటికి రాకుండానే తడిసి ముద్దయ్యింది. ఇక పనలపై ఉన్న ధాన్యంపై రైతులు ఆశలు వదులుకున్నారు. ఇప్పటి పరిస్థితు ల రీత్యా ఎకరానికి 15 బస్తాలు రావడం కష్టంగానే కనిపిస్తున్నది. మరో ఇరవై రోజులు గడిస్తే చాలా వరకు ఒబ్బిడి అయ్యేది. కానీ, తుఫాన్‌ కారణంగా జిల్లాలో 21 వేలకుపైగా హెక్టార్లలో పంటలు నీట మునగడంతో సుమారు రూ.54 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. 


 వర్షాలు, చలి గాలులతో అస్తవ్యస్తం

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చలిగాలుల తీవ్ర త విపరీతంగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గటం, రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోవటంతో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు చలిని తట్టుకోలేక నానా అవస్థలు పడు తున్నారు. ఏలూరులో టెంపరేచర్‌ అత్యధికంగా 25 అత్యల్పంగా 21 డిగ్రీలు నమోదైంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో చాలామంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. గడచిన 24 గంటల్లో ఆచంట మండలంలో అత్యధికంగా 147.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 8 మండలాల్లో 100 మిల్లీమీటర్లుపైగా, పది మండలాల్లో 90 మి.మీ.కుపైగా వర్షం కురిసింది. వర్షాలు, చలిగాలులకు జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. 


 పొంచి వున్న వ్యాధులు..  

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, దీనికితోడు చలిగాలుల తీవ్రతతో వృద్ధులు, చిన్న పిల్లలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఓ వైపు కరోనా కేసుల భయం వెంటాడుతుండగా, ఈ సమయంలో జ్వరాలు, ఇతర అనారోగ్య సమ స్యలు విజృంభిస్తే ఏమిటని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 


 దెబ్బతిన్న రహదారులు

వర్షాలకు అన్ని ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అసలే అంతంతమాత్రంగా వున్న జాతీయ, రాష్ట్ర రహదారులు ఇప్పు డు మరింత అధ్వానంగా తయారయ్యాయి. గుండుగొలను–కొవ్వూరు, తాడేపల్లిగూడెం–భీమవరం, నరసాపురం–నిడదవోలు, కొయ్యలగూడెం –తాడేపల్లిగూడెం, యలమిల్లిపుంత–తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం – జంగారెడ్డిగూడెం, ఏలూరు–కైకలూరు తదితర రహదారులు పెద్ద పెద్దగోతులతో నిండిపోయాయి. నష్టం కోట్లలో ఉంటుందని అధి కారులు అంచనా వేస్తున్నారు. ఎన్నో నెలల తర్వాత ఇటీవలే కొన్నిచోట్ల రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. తాజా వర్షాలతో ఇవి నిష్ప్రయోజనం కానున్నాయి. 


21 వేల హెక్టార్లు మునక

నివర్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు జిల్లాలో ని 389 గ్రామాల్లో 21 వేల 234 హెక్టార్లలో వరి, పత్తి, మినుము పంటలు నీట మునిగాయి. ఇందులో 20,058 హెక్టార్లలో వరి, 1,149 హెక్టార్లలో పత్తి, 27 హెక్టార్లలో మినుము ఉన్నాయి.వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం.. మండ లాల వారీగా నీట మునిగిన వరి పంటల వివరాలు.. పెదపాడు 1,378 హెక్టార్లు, ఏలూరు 222, దెందులూరు 283, పెదవేగి 150, భీమడోలు 43, ద్వారకా తిరుమల 116, ఉంగుటూరు 100, చింతలపూడి 165, లింగపాలెం 180, కామవరపుకోట 150, టి.నరసాపురం 62, తాడేపల్లిగూడెం 6, పెంటపాడు 132, గణపవరం 550, నిడమర్రు 83, కొవ్వూరు 50, తాళ్ళపూడి  50, గోపాలపురం 2, దేవరపల్లి 85, చాగల్లు 20, పోలవరం 450, వేలేరుపాడు 156, కొయ్యలగూడెం 60, జంగా రెడ్డిగూడెం 100, తణుకు 250, ఉండ్రాజవరం 35, పెరవలి 200, నిడదవోలు 200, పెనుగొండ 105, పెనుమంట్ర 950, ఇరగవరం 309, అత్తిలి 300, నరసాపురం 1,500, మొగల్తూరు 158, యలమంచిలి 778, పోడూరు 1,095, పాలకొల్లు 1675, ఆచంట 1,020, పాలకోడేరు 2,800, వీరవాసరం 1,117, భీమవరం 420, కాళ్ల 1,250, ఉండి 1,200, ఆకివీడు 103 హెక్టార్లు. అలాగే జీలుగుమిల్లి మండలంలో 100 హెక్టార్లు, కుక్కు నూరు 892, బుట్టాయిగూడెం 150, గోపాలపురం 7 హెక్టార్లలో పత్తి పంట ముంపునకు గురైంది.  మినుము పంట తాళ్లపూడి మండలంలో 10, దేవరపల్లి 5, గోపాలపురం 2, చాగల్లులో 10 హెక్టార్లలో నీట మునిగాయి.


ఇంత కురిసింది      (మి.మీ..లో)

ఆచంట 147.6

పోడూరు 117.6

భీమవరం 113.4

పాలకొల్లు 111.2

పెనుగొండ 110.4

యలమంచిలి 110.4 

వీరవాసరం 108.6 

ఉండి 108.4

మొగల్తూరు 107.6

పాలకోడేరు 97.8

కాళ్ళ 97.8

నరసాపురం 97.6

పెరవలి 97.2

తణుకు 97.2

గణపవరం 97.2

పెనుమంట్ర 95.6

ఉండ్రాజవరం 92.2

ఇరగవరం 92.2

తాడేపల్లిగూడెం 92.0

ఆకివీడు 88.6

నిడమర్రు 86.4

అత్తిలి 85.8  

ఉంగుటూరు 83.6 

నిడదవోలు 82.4

పెంటపాడు 80.4 

దెందులూరు 80.2

పెదపాడు 78.6

చాగల్లు 74.8

భీమడోలు 71.2 

ఏలూరు 69.4

పెదవేగి 68.0

కొవ్వూరు 65.6

ద్వారకా తిరుమల 60.4

తాళ్లపూడి 57.8 

దేవరపల్లి 55.2

కామవరపుకోట 54.6

లింగపాలెం 53.6 

గోపాలపురం 52.0

నల్లజర్ల 45.4 

జంగారెడ్డిగూడెం 45.2 

పోలవరం 42.0 

టి. నరసాపురం 40.2 

కొయ్యలగూడెం 39.6

చింతలపూడి 36.4

బుట్టాయిగూడెం 34.6 

జీలుగుమిల్లి 25.6 

వేలేరుపాడు 18.2 

కుక్కునూరు 13.4 








Updated Date - 2020-11-28T05:40:31+05:30 IST