కార్గో సర్వీసుల్లో టాప్‌

ABN , First Publish Date - 2021-06-24T04:59:30+05:30 IST

కార్గో సర్వీసుల ద్వారా విజయనగరం జిల్లా మెరుగ్గా ఉందని, ప్రథమ స్థానంలో నిలిచిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు. జోనల్‌ పర్యటనలో భాగంగా బుధవారం విజయనగరం ఆర్టీసీ జోనల్‌ కార్యాలయంతో పాటు డిపోను సందర్శించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాకు తొలిసారిగా వచ్చిన ఆయనకు ఆర్టీసీ అధికారులు ఘన స్వాగతం పలికారు.

కార్గో సర్వీసుల్లో టాప్‌
ఆర్టీసీ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు

విజయనగరం జోన్‌ ప్రథమ స్థానం 

ఏపీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ ద్వారక తిరుమలరావు 

విజయనగరం రింగురోడ్డు/ దాసన్నపేట, జూన్‌ 23: కార్గో సర్వీసుల ద్వారా విజయనగరం జిల్లా మెరుగ్గా ఉందని, ప్రథమ స్థానంలో నిలిచిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు. జోనల్‌ పర్యటనలో భాగంగా బుధవారం విజయనగరం ఆర్టీసీ జోనల్‌ కార్యాలయంతో పాటు డిపోను సందర్శించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాకు తొలిసారిగా వచ్చిన ఆయనకు ఆర్టీసీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రిజర్వేషన్‌ కౌంటర్‌, ఆర్టీసీ డిపో వర్క్‌షాపును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాసింజర్‌ సర్వీసులే కాకుండా కార్గో సర్వీసులు కూడా పెంచేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయాలి? లాభాల దిశగా ఎలా అడుగులు వేయాలి? తదితర అంశాలపై చర్చించినట్టు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం తగినన్ని బస్సులు కేటాయిస్తామన్నారు. ఆర్టీసీ పరంగా మున్ముందు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా, జోన్‌లో కార్గో సర్వీసులు అందిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎమ్‌డీ వెంట ఆర్టీసీ డీఎం బాపిరాజు, రీజనల్‌ సెక్రటరీ రాములు, డివిజనల్‌ ప్రతినిధులు సత్యం, రాఫిల్‌, చంద్రమౌళి, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. 

ఆర్టీసీ ఎమ్‌డీని కలిసిన ఎస్పీ  

ఆర్టీసీ ఎమ్‌డీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అదనపు డీజీ సీహెచ్‌ ద్వారక తిరుమలరావును బుధవారం జిల్లా పోలీసు అతిఽథి గృహం వద్ద ఎస్పీ రాజకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు.  పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ఆర్టీసీ ప్రాంతీయ కార్యాలయం, కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన అతిఽథి గృహం వద్ద పోలీసు అధికారులతో  చర్చించారు. శాంతిభద్రతల విషయమై ఎస్పీ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు.  


Updated Date - 2021-06-24T04:59:30+05:30 IST