నెంబరు ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు సీజ్
ABN , First Publish Date - 2021-07-24T05:42:25+05:30 IST
అర్బన్ పరిధిలో నెంబరు ప్లేటు లేని వాహనాలపై శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబరు ప్లేటు లేకుండా తిరుగుతున్న 150 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు ట్రాఫిక్ డీఎస్పీ వీవీ రమణకుమార్ తెలిపారు.
గుంటూరు, జూలై 23: అర్బన్ పరిధిలో నెంబరు ప్లేటు లేని వాహనాలపై శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబరు ప్లేటు లేకుండా తిరుగుతున్న 150 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు ట్రాఫిక్ డీఎస్పీ వీవీ రమణకుమార్ తెలిపారు. ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రైవ్లో రవాణా ఉప కమిషనర్ మీరాప్రసాద్, ఎంవీఐలు, తూర్పు ట్రాఫిక్ సీఐ ఎల్.వీరానాయక్, ఎస్ఐలు శివరామకృష్ణ, శ్రీహరి, కోటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, నరేంద్ర పాల్గొన్నారు.
వాహనాల నెంబరు ప్లేట్ల తనిఖీలు
నిబంధనలకు విరుద్ధంగా నెంబరు ప్లేట్లను అమర్చిన వాహనాలపై రవాణాశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మొత్తం 60 వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు డీటీసీ ఈ మీరాప్రసాదు పేర్కొన్నారు. కొంతమంది వాహన యజమానులు రవాణా వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, రవాణేతర అవసరాలకు తిప్పుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాహనాలపై ప్రభుత్వవాహనం అని ఉంటే ప్రత్యేక తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు. తనిఖీలలో ట్రాఫిక్ డీఎస్పీ వీవీ రమణకుమార్, మోటారు వాహన తనిఖీ అధికారులు రాములు, గోపాల్, ప్రసన్నకుమారి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.