Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇసుక లారీలతో ట్రాఫిక్‌ జాం

అర్వపల్లి, నవంబరు 29: జాజిరెడ్డిగూడెం సమీపంలోని నకిరేకల్‌–తానంచర్ల 365 జాతీయ రహదారిపై వందలాది ఇసుక లారీలను ఇషా ్టనుసారం నిలుపుతున్నందున కిలోమీటర్ల దూరం ట్రాఫిక్‌ జాం ఏర్పడు తోందని కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుడు దాసరి సోమయ్య తెలిపారు. అర్వ పల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఈ ప్రాంతంలో మూసీ నదిపై రూ.25 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మించారని, కాంట్రాక్టర్లు బ్రిడ్జి వద్దనే వాహనాలు నిలిపి ఇసుకను తోడేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఇసుక లారీలు రోడ్డుపై నిలప కుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 


Advertisement
Advertisement